Share News

స్త్రీనిధి ద్వారా రూ.346 కోట్ల రుణాలు

ABN , Publish Date - Oct 09 , 2025 | 01:38 AM

చిత్తూరు జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది స్త్రీనిధి ద్వారా రూ.346 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు.

స్త్రీనిధి ద్వారా రూ.346 కోట్ల రుణాలు

చిత్తూరు కలెక్టరేట్‌, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది స్త్రీనిధి ద్వారా రూ.346 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని డీఆర్డీఏ సమావేశ మందిరంలో ఏపీఎంలు, సీసీలతో జిల్లా ప్రగతిపై ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ ‘ఉన్నతి’ ద్వారా రూ.20 కోట్లు, సామాజిక పెట్టుబడి నిధి ద్వారా రూ.6 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించామని, ఈ అంశాలను ప్రజల్లో తీసుకెళ్లి వారి ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టిపెట్టాలని కోరారు. ఈ సందర్భంగా బ్యాంకు లింకేజి, మైక్రో క్రెడిట్‌ యాన్యువల్‌ యాక్షన్‌ ప్లాన్‌ (వార్షిక రుణప్రణాళిక), సప్లిమెంటరీ ఎన్‌సీపీ, స్త్రీనిధి, ఉన్నతి, ఉమెన్‌ లెడ్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ ఇన్‌స్టిట్యూషన్‌ బిల్డింగ్‌, లైవ్‌స్టాక్‌, ఆక్వా కల్చర్‌ అంశాలపై క్లస్టర్లు, మండలాలవారీగా సమీక్షించారు.

Updated Date - Oct 09 , 2025 | 01:38 AM