రైతుల ఖాతాల్లో రూ.104.15 కోట్ల జమ
ABN , Publish Date - Nov 20 , 2025 | 01:57 AM
అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ యోజన కింద 1,54,908 రైతుల ఖాతాల్లో రూ.104.15 కోట్లు జమయ్యాయి. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఈ నిధులను బుధవారం విడుదల చేయగా, ఆయా నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించారు. పలుచోట్ల ఎమ్మెల్యేలతో పాటు అన్ని సమావేశాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి నాయుడుపేటలో జరిగిన సమావేశంలో కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ పథకం, ప్రభుత్వ ఉద్దేశాన్ని వివరించారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తోందని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం రైతులకు అన్నదాత సుఖీభవ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఆర్డీవో కిరణ్మయి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ప్రసాద్‌రావు, ఏడీ ధనంజయరెడ్డి, ఏవోలు గణేష్, గాయత్రి, ఏఎంసీ చైర్మన్లు ఉయ్యాల ప్రవీణ్‌కుమార్, ఆకుతోట రమేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నాయుడుపేట/టౌన్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ యోజన కింద 1,54,908 రైతుల ఖాతాల్లో రూ.104.15 కోట్లు జమయ్యాయి. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఈ నిధులను బుధవారం విడుదల చేయగా, ఆయా నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించారు. పలుచోట్ల ఎమ్మెల్యేలతో పాటు అన్ని సమావేశాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి నాయుడుపేటలో జరిగిన సమావేశంలో కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ పథకం, ప్రభుత్వ ఉద్దేశాన్ని వివరించారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తోందని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం రైతులకు అన్నదాత సుఖీభవ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఆర్డీవో కిరణ్మయి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ప్రసాద్‌రావు, ఏడీ ధనంజయరెడ్డి, ఏవోలు గణేష్, గాయత్రి, ఏఎంసీ చైర్మన్లు ఉయ్యాల ప్రవీణ్‌కుమార్, ఆకుతోట రమేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.