రూఫ్‌టాప్ సోలార్‌కు ప్రాధాన్యం: సీఎండీ
ABN , Publish Date - Aug 16 , 2025 | 01:49 AM
సదరన్ డిస్కంలో రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్‌కు ప్రాధాన్యమిస్తూ, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఆ సంస్థ సీఎండీ కె.సంతోషరావు వెల్లడించారు.
తిరుపతి(ఆటోనగర్), ఆగస్టు15(ఆంధ్రజ్యోతి): సదరన్ డిస్కంలో రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్‌కు ప్రాధాన్యమిస్తూ, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఆ సంస్థ సీఎండీ కె.సంతోషరావు వెల్లడించారు. తిరుపతిలోని సదరన్ డిస్కం కార్యాలయం ప్రాంగణంలో శుక్రవారం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 8510 సర్వీసుల ద్వారా 29,535 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతోందన్నారు. ప్రస్తుతం నారావారిపల్లె సమీప గ్రామాల్లో 1600 సర్వీసులు ఏర్పాటు చేసి 3.5 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందన్నారు. ఉత్తమ సర్కిళ్లుగా కడప, తిరుపతి ఎస్‌ఈలు వెంకటరమణ, సురేంద్రనాయుడులు, సీజీఎం రామమోహనరావు, ఆదిశేషయ్య,శ్రీనివాసులు, ప్రసాద్, జీఎం ఎం.కృష్టారెడ్డి, శ్రీనివాసులు, ప్రసాద్, సురేంద్ర రావుతోపాటు 9 సర్కిల్స్ ఎస్‌ఈలు, ఈఈ, డీవైఈఈలు, ఏఈలు, ఏఏవోలు, పలు విభాగాల ఉద్యోగులు ఉత్తమ ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను సీఎండీ చేతులు మీదుగా అందుకున్నారు. డైరెక్టర్లు కె.గురవయ్య, పి.అయూబ్‌ఖాన్, సీజీఎంలు జె.రమణాదేవి, వరకుమార్, కెఆర్‌ఎస్ ధర్మజ్ఞాని, జానకిరామ్, ఆదిశేషయ్య, పి.మురళి, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ కె.జనార్దన్ నాయుడు, సీజీఆర్‌ఎఫ్ చైర్‌పర్సన్ శ్రీనివాస ఆంజనేయ మూర్తి తదితరులు పాల్గొన్నారు.