కాళ్లు, చేతులు కట్టేసి దోపిడీ
ABN , Publish Date - Jun 04 , 2025 | 02:08 AM
కాళ్లు, చేతులు కట్టేశారు. షోరూములోని రూ.7 లక్షలు దోపిడీ చేసుకెళ్లారు. ఈ ఘటన తిరుపతి నగరం రేణిగుంట రోడ్డులోని భార్గవి ఆటోమొబైల్స్ (మారుతీ షోరూం)లో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. క్రైం పోలీసుల కథనం మేరకు.. ముఖాలకు ముసుగు వేసుకున్న నలుగురు యువకులు మంగళవారం తెల్లవారుజామున షోరూమ్‌లోకి ప్రవేశించారు. లోపలున్న సేల్స్ ఎగ్జిక్యూటివ్ బాలాజీ చేతులు, కాళ్ళు కట్టేశారు. మేనేజర్ రూములోకి చొరబడ్డారు. అక్కడ రూ.7 లక్షలున్న చిన్న లాకర్ తీసుకెళ్లారు. ఆ తర్వాత కట్లు విడిపించుకుని బాలాజీ పోలీసులకు సమాచారం అందించారు. క్రైం అదనపు ఎస్పీ నాగభూషణరావు, క్రైం డీఎస్పీ శ్యాంసుందర్, తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం, సీఐలు రాంకిషోర్, శ్రీనివాసులు, శ్రీనివాసులురెడ్డి, ఎస్‌ఐలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆ నలుగురు దొంగలకు 25 నుంచి 35 ఏళ్లు ఉంటాయి. వీరు హౌస్ బ్రేకింగ్‌లో ఆరితేరిన వారు. ఈ నలుగురు రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వచ్చి షోరూమ్ వెనుక వైపు నుంచి లోపలకు ప్రవేశించినట్లు భావిస్తున్నారు. హిందీ స్పష్టంగా మాట్లాడుతుండటంతో.. ఉత్తరాదికి చెందిన ముఠాగా అనుమానిస్తున్నారు. పరిసరాల్లో తనిఖీ చేసిన పోలీసులకు రైల్వే ట్రాక్‌పై పగులకొట్టి ఉన్న లాకర్ కనిపించగా దాన్ని సీజ్ చేశారు. షోరూములోని ముఖ్యప్రాంతాల్లో వేలి ముద్రల నిపుణలు వేలి ముద్రలు సేకరించారు. పాత నేరస్థుల వేలిముద్రలను పరిశీలించి.
- తిరుపతిలోని కార్ల షోరూంలో రూ.7 లక్షల అపహరణ
-ఘటనా స్థలం పరిశీలించిన పోలీసు బృందాలు
- ఉత్తరాది ముఠాగా అనుమానం
- మూడు బృందాలు ఏర్పాటు చేసిన ఎస్పీ
తిరుపతి(నేరవిభాగం), జూన్ 3 (ఆంధ్రజ్యోతి): కాళ్లు, చేతులు కట్టేశారు. షోరూములోని రూ.7 లక్షలు దోపిడీ చేసుకెళ్లారు. ఈ ఘటన తిరుపతి నగరం రేణిగుంట రోడ్డులోని భార్గవి ఆటోమొబైల్స్ (మారుతీ షోరూం)లో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. క్రైం పోలీసుల కథనం మేరకు.. ముఖాలకు ముసుగు వేసుకున్న నలుగురు యువకులు మంగళవారం తెల్లవారుజామున షోరూమ్‌లోకి ప్రవేశించారు. లోపలున్న సేల్స్ ఎగ్జిక్యూటివ్ బాలాజీ చేతులు, కాళ్ళు కట్టేశారు. మేనేజర్ రూములోకి చొరబడ్డారు. అక్కడ రూ.7 లక్షలున్న చిన్న లాకర్ తీసుకెళ్లారు. ఆ తర్వాత కట్లు విడిపించుకుని బాలాజీ పోలీసులకు సమాచారం అందించారు. క్రైం అదనపు ఎస్పీ నాగభూషణరావు, క్రైం డీఎస్పీ శ్యాంసుందర్, తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం, సీఐలు రాంకిషోర్, శ్రీనివాసులు, శ్రీనివాసులురెడ్డి, ఎస్‌ఐలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆ నలుగురు దొంగలకు 25 నుంచి 35 ఏళ్లు ఉంటాయి. వీరు హౌస్ బ్రేకింగ్‌లో ఆరితేరిన వారు. ఈ నలుగురు రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వచ్చి షోరూమ్ వెనుక వైపు నుంచి లోపలకు ప్రవేశించినట్లు భావిస్తున్నారు. హిందీ స్పష్టంగా మాట్లాడుతుండటంతో.. ఉత్తరాదికి చెందిన ముఠాగా అనుమానిస్తున్నారు. పరిసరాల్లో తనిఖీ చేసిన పోలీసులకు రైల్వే ట్రాక్‌పై పగులకొట్టి ఉన్న లాకర్ కనిపించగా దాన్ని సీజ్ చేశారు. షోరూములోని ముఖ్యప్రాంతాల్లో వేలి ముద్రల నిపుణలు వేలి ముద్రలు సేకరించారు. పాత నేరస్థుల వేలిముద్రలను పరిశీలించి.. ఈ ఘటన వెనుక వున్న దోపిడీ ముఠా ఎవరై ఉంటారనే కోణంలో దర్యాప్తు సాగించనున్నారు. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. అక్కడ వున్న సీసీ కెమెరాలు పరిశీలించి పుటేజీ సేకరించారు. తిరుపతి క్రైం సీఐ శివకుమార్ రెడ్డి కేసు నమోదు చేశారు. కాగా, దామినేడు వద్ద ఉన్న ఓ కారు షోరూములోనూ సోమవారం వేకువజామున చోరీకి యత్నించి సెక్యూరిటీని నిర్బంధించారు. ఈ దోపిడీ ఘటనల నేపథ్యంలో ఎస్పీ హర్షవర్ధనరాజు సీరియ్‌సగా స్పందించారు. అనుమానం వున్న వారి కోసం మూడు పోలీసు బృందాలను నియమించారు. వీరు తిరుమల, తిరుపతి, చెన్నైతో పాటు విజయవాడ, హైదరాబాదుకు వెళ్ళినట్లు తెలిసింది.
అధికారులతో సమీక్ష
జిల్లా అదనపు ఎస్పీలు రవిమనోహరాచ్చారి, నాగభూషణరావు, డీఎస్పీలు ప్రసాద్, భక్తవత్సలం, శ్యాంసుందర్‌తో ఎస్పీ హర్షవర్ధనరాజు తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. దోపిడీ దొంగల ఆచూకీ గుర్తించి అరెస్టు చేయాలని క్రైం పోలీసులను ఆదేశించారు. గతంలో సీపీఆర్ విల్లా్‌సలో జరిగిన దొంగతనాలపైనా సమీక్ష చేసిన ఎస్పీ.. ఆ కేసు ఎంత వరకు వచ్చిందని ఆరా తీశారు. ఎస్పీ అడిగిన ప్రశ్నలకు కొందరు పోలీసు అధికారులు నోరు మెదపనట్లు తెలిసింది. స్మార్ట్ వర్కు చేసి ఫిలితాలు రాబట్టాలని సూచించారు.