Share News

సూళ్లూరుపేట కమిషనర్‌ చిన్నయ్యకు రివర్షన్‌

ABN , Publish Date - May 01 , 2025 | 01:46 AM

సూళ్లూరుపేట మున్సిపల్‌ కమిషనరు చిన్నయ్యకు రివర్షన్‌ ఇస్తూ బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురే్‌షకుమార్‌ ఉత్తర్వ్యులు జారీ చేశారు.

సూళ్లూరుపేట కమిషనర్‌ చిన్నయ్యకు రివర్షన్‌

సూళ్లూరుపేట, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): సూళ్లూరుపేట మున్సిపల్‌ కమిషనరు చిన్నయ్యకు రివర్షన్‌ ఇస్తూ బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురే్‌షకుమార్‌ ఉత్తర్వ్యులు జారీ చేశారు. చిత్తూరు నగరపాలక సంస్థలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న చిన్నయ్య పదోన్నతిపై మంగళగిరి మున్సిపాలిటీకి కమిషనర్‌గా వె ళ్లగా ఆపై సూళ్లూరుపేటకు బదిలీపై వచ్చారు. ఈయన పదోన్నతిని పునఃపరిశీలించిన డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ర్టేషన్‌ చిత్తూరు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా రివర్షన్‌ ఇచ్చింది. కాగా సూళ్లూరుపేట మేనేజర్‌ శ్రీనివా్‌సకు అక్కడ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.

Updated Date - May 01 , 2025 | 01:46 AM