పెండింగ్ సమస్యలు పరిష్కరించండి
ABN , Publish Date - Mar 12 , 2025 | 01:42 AM
బ్యాంకుల్లో అవసరమైన మేరకు నియామకాలు చేపట్టి, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలంటూ మంగళవారం చిత్తూరులోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రాంతీయ కార్యాలయం ఎదుట వివిధ బ్యాంకుల ఉద్యోగులు ధర్నా చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఈనెల 24, 25 తేదీల్లో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ (యూఎ్‌ఫబీయూ) ఆధ్వర్యంలో దేశవ్యాప్త బ్యాంకింగ్ సమ్మె చేపడతామని చిత్తూరు జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ కమిటీ అధ్యక్షుడు టి.శేఖర్, ఏఐబీవోసీ యూనియన్ ప్రతినిధి కె.వినీష్ బాబు తెలిపారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉద్యోగులు నినాదాలు చేశారు. ఎన్‌సీబీఈ ప్రతినిధి ఏకే శ్రీహరి, ఏఐబీఈఏ యూనియన్ ప్రతినిధి చెన్నకేశవ తదితరులు ప్రసంగించగా.. ప్రభుత్వ, సహకార, గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు.

చిత్తూరు కలెక్టరేట్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): .బ్యాంకుల్లో అవసరమైన మేరకు నియామకాలు చేపట్టి, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలంటూ మంగళవారం చిత్తూరులోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రాంతీయ కార్యాలయం ఎదుట వివిధ బ్యాంకుల ఉద్యోగులు ధర్నా చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఈనెల 24, 25 తేదీల్లో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ (యూఎ్‌ఫబీయూ) ఆధ్వర్యంలో దేశవ్యాప్త బ్యాంకింగ్ సమ్మె చేపడతామని చిత్తూరు జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ కమిటీ అధ్యక్షుడు టి.శేఖర్, ఏఐబీవోసీ యూనియన్ ప్రతినిధి కె.వినీష్ బాబు తెలిపారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉద్యోగులు నినాదాలు చేశారు. ఎన్‌సీబీఈ ప్రతినిధి ఏకే శ్రీహరి, ఏఐబీఈఏ యూనియన్ ప్రతినిధి చెన్నకేశవ తదితరులు ప్రసంగించగా.. ప్రభుత్వ, సహకార, గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు.