అక్రమాల రెస్కో!
ABN , Publish Date - Sep 30 , 2025 | 01:16 AM
కుప్పం రెస్కోలో నియామకాలు, పదోన్నతులు, ఆడిటింగ్ నివేదికలు, వేతనాల పెంపు... అన్నింటా సహకార చట్టం నిబంఽధనల అతిక్రమణ యథేచ్ఛగా సాగింది.సహకార సంఘాల అదనపు రిజిస్ట్రార్ కె.శ్రీలక్ష్మి ప్రభుత్వానికి సమర్పించిన విచారణ నివేదికలో రెస్కోలో జరిగిన అవినీతి, అక్రమాలను విస్పష్టంగా తేల్చింది.
నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు.. పదోన్నతులు.. తప్పుడు ఆడిటింగ్... మితిమీరిన వేతనాలు
నిజాలు నిగ్గు తేల్చిన విచారణ నివేదిక
మహాజన సభలో సమర్పణ
కుప్పం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కుప్పం రెస్కోలో నియామకాలు, పదోన్నతులు, ఆడిటింగ్ నివేదికలు, వేతనాల పెంపు... అన్నింటా సహకార చట్టం నిబంఽధనల అతిక్రమణ యథేచ్ఛగా సాగింది.సహకార సంఘాల అదనపు రిజిస్ట్రార్ కె.శ్రీలక్ష్మి ప్రభుత్వానికి సమర్పించిన విచారణ నివేదికలో రెస్కోలో జరిగిన అవినీతి, అక్రమాలను విస్పష్టంగా తేల్చింది.ప్రధానంగా పేర్కొనక పోయినా గత వైసీపీ ప్రభుత్వ పాలనాకాలంలోనే నిబంధనల అతిక్రమణ ఎక్కువ జరిగినట్టు నివేదిక నిర్ధారించింది. పుష్కరకాలం తర్వాత సోమవారం జరిగిన రెస్కో మహాజన సభ (సర్వసభ్య సమావేశం)లో విచారణ వేదికను బయటపెట్టారు. రెస్కో చైర్మన్ వీజీ.ప్రతాప్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డైరెక్టర్లు, రెస్కో ఎండీ సోమశేఖర్, ఉద్యోగులు, షేర్ హోల్డర్లు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్,ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎ్‌స.మునిరత్నం, పీకేఎం ఉడా చైర్మన్ డాక్టర్ బీఆర్.సురేశ్‌బాబు, ఏఎంసీ చైర్మన్ జీఎం.రాజు తదితరులు ప్రత్యేక ఆహ్వానితులుగా హజరయ్యారు. విచారణ నివేదికలో ప్రధానంగా రెస్కోలో జరిగినట్లుగా గుర్తించి నిర్ధారించిన అవినీతి చర్యలు, విచారణాఽధికారి చేసిన చర్యల సిఫార్సులు ఇవీ...ఫ రెస్కోలో మంజూరు పోస్టులు 167 కాగా, ప్రస్తుతం 229 మంది పని చేస్తున్నారు. వీరుగాక అదనంగా 124 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. 124 మందికి నిబంధనలను అతిక్రమించి అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చారు. ఇందులో అవసరం లేకపోయినా ఇచ్చిన ఉద్యోగాలు, మంజూరు కాకపోయినా కల్పించిన పోస్టుల్లో చేసిన నియామకాలు ఉన్నాయి. వీరిపై చర్యలు తీసుకోవాలిఫ 2021లో పర్సన్ ఇన్‌చార్జి కమిటీ సభ్యురాలిగా రాజీనామా చేసిన వసుంధరతో పాటు మిగిలిన సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసి, పరిపాలనాపరమైన నిర్ణయాలు తీసుకున్నారు. దీనిపై అప్పటి రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్, ఎండీ సుబ్రహ్మణ్యంపై చర్యలు తీసుకోవాలి.ఫ సంస్థలోని 48 మందికి అప్పటి ఎండీ సుబ్రహ్మణ్యం పాత తేదీలతో పదోన్నతులు కల్పించి, జీతాలు చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవడంతో పాటు అదనంగా చెల్లించిన నగదు మొత్తం రూ.89,563 ఉద్యోగులనుంచి రికవరీ చేయాలి.
సెలవులను, సస్పెన్షన్ కాలాన్ని రెగ్యులైజ్ చేసి ఎం.కృష్ణమూర్తి అనే ఉద్యోగికి కల్పించిన రెండు పదోన్నతులు రద్దు చేసి రివర్షన్ ఇవ్వాలి.ఫ నిబంధనలకు విరుద్ధంగా అప్పటి చైర్మన్ సెంథిల్ కుమార్‌కు చెల్లించిన వెహికల్ చార్జీలు రూ.22,52,689 నగదు మొత్తాన్ని ఆయననుంచి రికవరీ చేయాలి.నిబంధనలకు విరుద్ధంగా గత పీఐసీ కమిటీ సభ్యులకు చెల్లించిన రూ.2,17,600 నగదు మొత్తాన్ని వారినుంచి రికవరీ చేయాలి.ఫ 2021-2022 మఽధ్యలో జరిగిన ఆడిటింగ్‌లో అవకతవకలకు పాల్పడిన ఆడిటర్ వై.రమే్‌షపై చర్యలు తీసుకోవాలి.ఫ ఫేక్ ఐటీఐ సర్టిఫికెట్‌తో పదోన్నతి పొందిన ఆర్.నారాయణప్పపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.
రెస్కోలో అవినీతికి, అక్రమాలకు బాధ్యులైన సహకార సంఘం అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.
ఫ సహకార సంఘాల చట్టానికి విరుద్ధంగా పే ఫిక్సేషన్ చేసుకుని అధిక వేతనాలు పొందుతున్న వారిపైనా, ఇందుకు కారణమైన అప్పటి ఎండీ సుబ్రహ్మణ్యంపైనా సంస్థాపరమైన చర్యలు తీసుకోవాలి.ఫ అన్ని అవినీతి, అక్రమాలకు వీలు కల్పించేలా బైలా్‌సను సవరించడానికి కారణమైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి.ఫ ప్రాజెక్ట్ ఇంజనీరుగా కొనసాగుతున్న ఏఎ్‌స.హిమ్మత్ సాగర్‌ను అదనపు సిబ్బందిగా గుర్తించకపోతే మంజూరైన సిబ్బంది సంఖ్యకు అనుగుణంగా సర్దుబాటు చేయాలి. లేదంటే నోటీసు ఇచ్చి అతడి సేవలను రద్దు చేయాలి.ఫ అక్రమంగా జరిగిన పదోన్నతులపై కోర్టులను ఆశ్రయించి, న్యాయం జరిగేలా చూడాలి.ఇంకా పలు ఆరోపణలపై అందిన ఫిర్యాదులపైన సమగ్ర విచారణ జరిపిన విచారణాధికారి, ఆయా అక్రమాలు, అవినీతి చర్యలను నిర్ధారించింది.బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.