Share News

ఆ ఏడుగురు సీఐలపై డీఐజీకి నివేదిక

ABN , Publish Date - Jul 05 , 2025 | 01:41 AM

వీఆర్‌, అటాచ్‌మెంటులోని ఏడుగురు సీఐలపై డీఐజీకి జిల్లా పోలీసు యంత్రాంగం నివేదిక పంపింది. ఆ సీఐల పనితీరు.. అటాచ్‌మెంటులో ఉన్నవారు ఎలా పనిచేస్తున్నారు? వీఆర్‌కి రావడానికి కారణాలు ఏమిటి అనే సమగ్ర వివరాలతో ఈ నివేదిక పంపారు.

ఆ ఏడుగురు సీఐలపై డీఐజీకి నివేదిక

త్వరలో ఐదారుగురి బదిలీ

తిరుపతి(నేరవిభాగం), జూలై 4 (ఆంధ్రజ్యోతి): వీఆర్‌, అటాచ్‌మెంటులోని ఏడుగురు సీఐలపై డీఐజీకి జిల్లా పోలీసు యంత్రాంగం నివేదిక పంపింది. ఆ సీఐల పనితీరు.. అటాచ్‌మెంటులో ఉన్నవారు ఎలా పనిచేస్తున్నారు? వీఆర్‌కి రావడానికి కారణాలు ఏమిటి అనే సమగ్ర వివరాలతో ఈ నివేదిక పంపారు. దీనిని అనుసరించి కొంతమంది సీఐలకు పోస్టింగులిచ్చే అవకాశముంది. త్వరలో అనంతపురం రేంజ్‌ పరిధిలో సీఐల బదిలీలు జరగనున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో జిల్లాలో పనిచేస్తున్న కొంతమంది సీఐలకు స్థానచలనం కలగనుంది. ఐదారు మంది సీఐలు బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చంద్రగిరి సీఐ సుబ్బరామిరెడ్డిని తిరుపతి ట్రాఫిక్‌కు మార్చారు.

Updated Date - Jul 05 , 2025 | 01:41 AM