Share News

50 మంది ఒప్పంద అధ్యాపకుల సర్వీసు పునరుద్ధరణ

ABN , Publish Date - Jul 25 , 2025 | 01:47 AM

జిల్లాలోని డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకుల సర్వీసు రెన్యువల్‌పై గురువారం స్థానిక పీవీకేఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జేసీ విద్యాధరి అధ్యక్షతన కౌన్సెలింగ్‌ జరిగింది.

50 మంది ఒప్పంద అధ్యాపకుల సర్వీసు పునరుద్ధరణ
అధ్యాపకులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న జేసీ విద్యాధరి

చిత్తూరు సెంట్రల్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకుల సర్వీసు రెన్యువల్‌పై గురువారం స్థానిక పీవీకేఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జేసీ విద్యాధరి అధ్యక్షతన కౌన్సెలింగ్‌ జరిగింది. 2025-26 సంవత్సరానికిగాను జిల్లాలోని 50 మంది ఒప్పంద అధ్యాపకుల సర్వీసును పునరుద్ధరించారు. వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు నాగేంద్ర, మనోహర్‌, విజయేలురెడ్డి, వేణుగోపాల్‌, షణ్ముణం, చిదంబరం, శ్రీనివాస్‌, అన్నపూర్ణ, శారద తదితరులు పాల్గొన్నారు.

బదిలీల్లో జాప్యం

నిబంధనల ప్రకారం ఐదేళ్లు ఒకేచోట సర్వీసు పూర్తిచేసిన వారిని తప్పకుండా ఇతర కాలేజీలకు బదిలీ చేయాలి. ఈ ప్రక్రియలో జాప్యం జరిగినట్లు సమాచారం. ఏ కళాశాల అధ్యాపకులను అదే కళాశాలలో కొనసాగించేందుకు ప్రిన్సిపాళ్లు యత్నించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో జేసీని కూడా తప్పుదారి పట్టించారనే విమర్శలు వస్తున్నాయి. దీనివల్ల పలువురు అధ్యాపకులకు అన్యాయం జరిగిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. జేసీ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Updated Date - Jul 25 , 2025 | 01:47 AM