Share News

మామిడి రైతులకు ఊరట

ABN , Publish Date - Jun 27 , 2025 | 12:55 AM

మామిడి రైతులకు ఊరట కల్గించేలా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. ‘అన్‌లోడింగుకు దారేది?’ శీర్షికన గురువారం ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై ఆయన తీవ్రంగా స్పందించారు.

మామిడి రైతులకు ఊరట
ఫుడ్‌ ఇన్స్‌ ఫ్యాక్టరీ వద్ద నిలిచి ఉన్న ట్రాక్టర్లు

గుడిపాల, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): మామిడి రైతులకు ఊరట కల్గించేలా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. ‘అన్‌లోడింగుకు దారేది?’ శీర్షికన గురువారం ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై ఆయన తీవ్రంగా స్పందించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎస్‌ఐ రామ్మోహన్‌కు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. రోజూ 150 నుంచి 200 ట్రాక్టర్ల వరకు ఫ్యాక్టరీలోకి పంపించేలా చూడాలన్నారు. సిఫార్సులకు స్వస్తి పలికి రైతులు తీసుకొచ్చిన మామిడి కాయలను ఒకటి, రెండ్రోజుల్లోగా అన్‌లోడ్‌ అయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాగా, గురువారం కూడా తాసా ఫ్యాక్టరీకి సంబంధించి చీలాపల్లె మిట్ట వరకు ట్రాక్టర్లు నిలిచిపోగా.. గొల్లమడుగు వద్ద ఉన్న ఫుడ్‌ ఇన్స్‌ ఫ్యాక్టరీ నుంచి తమిళనాడు సరిహద్దులోని బాంబుల ఫ్యాక్టరీ వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో రైతులతో తహసీల్దార్‌ శ్రీనివాసులు మాట్లాడారు. ఇకపై టోకెన్లను జారీ చేస్తామని, సీరియల్‌ ప్రకారం అన్‌లోడ్‌ చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పంట పూర్తిగా ఫ్యాక్టరీకి తోలేవరకు ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ రైతుల ఖాతాల్లో జమ చేస్తామని భరోసా ఇచ్చారు.

Updated Date - Jun 27 , 2025 | 12:55 AM