Share News

ఇలా రిజిస్ట్రేషన్‌.. అలా చేతికి డాక్యుమెంట్లు

ABN , Publish Date - Jul 30 , 2025 | 01:46 AM

ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత సులువుగా, క్షణాల్లో అందించేలా డిజిటల్‌ గవర్నెన్స్‌ను విస్తరిస్తోంది. కొత్త ప్రభుత్వం వచ్చాక రిజిస్ట్రేషన్‌ శాఖలో పలు మార్పులు తీసుకొస్తోంది. ఇప్పటికే ‘మనమిత్ర’ పేరుతో వాట్సాప్‌ ద్వారా సుమారు 300 సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖలో మరో కొత్తసేవను అందుబాటులోకి తెచ్చారు. ఆస్తి రిజిస్ట్రేషన్‌ పూర్తయిన వెంటనే కొనుగోలుదారుడి వాట్సాప్‌ నెంబరుకు ఒరిజినల్‌ రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్‌ వచ్చేస్తుంది. ఆగస్టు ఒకటో తేదీనుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చిత్తూరు, తిరుపతి నగరపాలక సంస్థల పరిధిలో ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది.

ఇలా రిజిస్ట్రేషన్‌.. అలా చేతికి డాక్యుమెంట్లు

వాట్సాప్‌ ద్వారా సాధ్యం చేయనున్న ప్రభుత్వం

చిత్తూరు కలెక్టరేట్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత సులువుగా, క్షణాల్లో అందించేలా డిజిటల్‌ గవర్నెన్స్‌ను విస్తరిస్తోంది. కొత్త ప్రభుత్వం వచ్చాక రిజిస్ట్రేషన్‌ శాఖలో పలు మార్పులు తీసుకొస్తోంది. ఇప్పటికే ‘మనమిత్ర’ పేరుతో వాట్సాప్‌ ద్వారా సుమారు 300 సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖలో మరో కొత్తసేవను అందుబాటులోకి తెచ్చారు. ఆస్తి రిజిస్ట్రేషన్‌ పూర్తయిన వెంటనే కొనుగోలుదారుడి వాట్సాప్‌ నెంబరుకు ఒరిజినల్‌ రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్‌ వచ్చేస్తుంది. ఆగస్టు ఒకటో తేదీనుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చిత్తూరు, తిరుపతి నగరపాలక సంస్థల పరిధిలో ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది.

మధ్యవర్తుల ప్రమేయం లేకుండా.. : ఇప్పటివరకు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాక ఆయా పత్రాలు (డాక్యుమెంట్లు)ను డాక్యుమెంట్‌ రైటర్లు తీసుకుని కొనుగోలుదారులకు ఇచ్చేవారు. వారికి ఎంతోకొంత ముట్టజెప్పాల్సి వచ్చేది. ఇప్పుడు మీడియేటర్ల ప్రమేయం లేకుండానే వాట్సాప్‌ ద్వారా నేరుగా డాక్యుమెంట్‌ పంపించేలా రిజిస్ట్రేషన్‌ శాఖ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కార్డ్‌ ప్రైమ్‌ 2.0 సాఫ్ట్‌వేర్‌ను నవీకరించింది. పత్రాలను డిజిటల్‌ స్కానింగ్‌ చేసిన తర్వాత కొనుగోలుదారుడి ఆధార్‌తో అనుసంధానమైన ఫోన్‌నెంబరు వాట్సా్‌పకు వెళ్లిపోతాయి. కొనుగోలుదారుడు డౌన్‌లోడ్‌ చేసుకుని వాటిని ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చు. తర్వాత ఎప్పుడైనా కార్యాలయానికి వచ్చి డాక్యుమెంట్‌ నెంబరు చెప్పి బయోమెట్రిక్‌ వేసి, దస్తావేజులను తీసుకోవచ్చు.

Updated Date - Jul 30 , 2025 | 01:46 AM