రహదారుల అభివృద్ధికి మళ్లీ నిధులు
ABN , Publish Date - Oct 09 , 2025 | 01:32 AM
చిత్తూరు జిల్లాలోని 89.40 కిలోమీటర్ల రహదారుల్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తాజాగా రూ.39.40 కోటను మంజూరు చేసింది.రాష్ట్రంలోని 274 రహదారుల అభివృద్ధికి రూ.వెయ్యి కోట్ల నిధులు మంజూరయ్యాయి.వీటిలో రాష్ట్ర రహదారుల కోసం రూ.400 కోట్లు, ప్రధాన జిల్లా రహదారుల కోసం రూ.600 కోట్లను కేటాయించారు.
89.40 కిలోమీటర్ల మేర అభివృద్ధికి చర్యలు
రూ.39.40 కోట్లతో 12 పనుల మంజూరు
ఇప్పటికే రూ.260 కోట్లతో రహదారుల అభివృద్ధి
చిత్తూరు, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 89.40 కిలోమీటర్ల రహదారుల్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తాజాగా రూ.39.40 కోటను మంజూరు చేసింది.రాష్ట్రంలోని 274 రహదారుల అభివృద్ధికి రూ.వెయ్యి కోట్ల నిధులు మంజూరయ్యాయి.వీటిలో రాష్ట్ర రహదారుల కోసం రూ.400 కోట్లు, ప్రధాన జిల్లా రహదారుల కోసం రూ.600 కోట్లను కేటాయించారు.వైసీపీ ప్రభుత్వం రహదారుల్ని నిర్లక్ష్యం చేసింది. నిర్వహణను కూడా పట్టించుకోకపోవడంతో రహదారులన్నీ ఛిద్రమైపోయాయి.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రహదారులకు ప్రాధాన్యమిస్తోంది. ఆగస్టులో రూ.38.25 కోట్ల నాబార్డు, స్టేట్ గవర్నమెంట్ నిధులతో జిల్లాలోని రహదారుల అభివృద్ధి పనులు చేపట్టగా.. అంతకుముందే రూ.222 కోట్లతో రహదారులకు మరమ్మతులతో పాటు అభివృద్ధి చేశారు. తాజాగా మంజూరైన రూ.39.40 కోట్లను కలుపుకుంటే ఇప్పటివరకు ప్రభుత్వం రహదారులకు కేటాయించిందే రూ.300 కోట్లు. మరోవైపు రూ.వేల కోట్లతో నేషనల్ హైవేస్, ఎక్స్‌ప్రెస్ హైవేస్ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.
చిత్తూరు- గుడియాత్తం రోడ్డుకు రూ.7.50 కోట్లు
జిల్లాలోని రాష్ట్ర రహదారులైన చిత్తూరు- పుత్తూరు రోడ్డును రూ.3 కోట్లతో 5.6 కిలోమీటర్లు, చిత్తూరు- గుడియాత్తం రోడ్డును రూ.7.50 కోట్లతో 11.77 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నారు.అలాగే ప్రధాన జిల్లా రహదారుల విభాగంలో పది రోడ్లను అభివృద్ధి చేయనున్నారు.ఫకుప్పం,పలమనేరు,చిత్తూరు,పూతలపట్టు నియోజకవర్గాల్లోని ఆరిమానిపేట- పీకే రోడ్డు వయా వీర్నమల రహదారిని రూ.2.60 కోట్లతో 6.6 కిలోమీటర్లు ఫ కుప్పం గరిగచేనుపల్లె రోడ్డు - పీబీనత్తం వయా కాకిమడుగు... చెక్కునత్తం రోడ్డు - మల్లానూరు రైల్వేస్టేషన్ వయా వరదరాజపురం రోడ్లను రూ.2.60 కోట్లతో 7 కిలోమీటర్లు ఫ రాళ్లబూదుగూరు - కోనేరు కుప్పం రోడ్డు... శాంతిపురం సి.బండపల్లె - కరుముట్ల క్రాస్... రోడ్లను 5.77 కిలోమీటర్లు అభివృద్ధి చేసేందుకు రూ.2.20 కోట్లు ఫ కుప్పం- రామకుప్పం రోడ్డు వయా కృష్ణరాజపురం... ‘గెర్నిపల్లె జంపురెడ్డి చెరువు, చాకలకుప్పం, గొరివిమాకులపల్లె రోడ్లను 9.70 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసేందుకు రూ.4 కోట్లు ఫ దండికుప్పం రోడ్డు- విజలాపురం వయా వెంకటేశపురం... పలమనేరు కృష్ణగిరి రోడ్డు (కుప్పం పట్టణ పరిధి) 5.30 కిలోమీటర్ల అభివృద్ధికి రూ.2.20 కోట్లు ఫ పలమనేరు కుప్పం రోడ్డు- తమిళనాడు బోర్డర్ వయా కొలమాసనపల్లె రోడ్డును రూ.3.90 కోట్లతో 12.50 కిలోమీటర్లు ఫ ఏపీ రోడ్డు - అప్పినపల్లె వయా బొమ్మరాజుపల్లె రోడ్డు... పలమనేరు గుండుగల్లు రోడ్డు వయా దండుపల్లె శంకర్రాయలపేట రహదారుల్ని 12.50 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసేందుకు రూ.4.70 కోట్లు ఫ సదుం- నంజంపేట రోడ్డు వయా చెరుకువారిపల్లె మార్గాన్ని 0.90 కిలోమీటర్ల మేర రూ.1.50 కోట్లతో ఫ సీకేటీ రోడ్డు- చిత్తూరు అరగొండ రోడ్డు వయా ముత్తిరేవుల నగనాగపల్లెరోడ్డును 6 కిలోమీటర్లు రూ.2.80 కోట్లతో ఫ చిత్తూరు వేలూరు రోడ్డు - చిత్తపార వరకు 5.83 కిలోమీటర్లు రూ.2.40 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు.