Share News

జూలో ఎర్ర మెడ వాలాబీ మృతి

ABN , Publish Date - Nov 04 , 2025 | 12:55 AM

తిరుపతిలోని ఎస్వీ జూపార్కులో సోమవారం ఆడ ఎర్రమెడ వాలాబీ అనారోగ్యంతో మృతిచెందినట్లు జూపార్కు క్యూరేటర్‌సెల్వం తెలిపారు.

జూలో ఎర్ర మెడ వాలాబీ మృతి
వాలాబీ (ఫైల్‌ ఫొటో)

మంగళం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని ఎస్వీ జూపార్కులో సోమవారం ఆడ ఎర్రమెడ వాలాబీ అనారోగ్యంతో మృతిచెందినట్లు జూపార్కు క్యూరేటర్‌సెల్వం తెలిపారు. మూడు రోజుల క్రితం టాక్సో ప్లాస్మోసిస్‌ వ్యాధిసోకి మగ ఎర్రమెడ వాలాబీ మృతి చెందగా.. ఇపుడు అదే సమస్యతో ఆడవాలాబీ మృతి చెందిందన్నారు. ఈ ఏడాది ఆగస్టులో గుజరాత్‌కు చెందిన రాధేకృష్ణ టెంపుల్‌ ఎలిఫెంట్‌ వెల్ఫేర్‌ ట్రస్టు ఒక జత మీర్‌ కాట్స్‌, ఒక జత కామన్‌ మార్మోసెట్స్‌తో పాటు ఒక జత ఎర్ర మెడగల వాలాబీలను జూపార్కుకు విరాళంగా ఇచ్చారు. వాలాబీ కళేబరానికి పోస్టుమార్టం నిమిత్తం వెటర్నరీ యూనివర్సిటీకి తరలించారు.

Updated Date - Nov 04 , 2025 | 12:55 AM