పాలారుపై రూ.53.35 కోట్లతో 17 చెక్ డ్యాముల పునర్నిర్మాణం
ABN , Publish Date - Jun 25 , 2025 | 12:50 AM
కుప్పం నియోజకవర్గంలో 67కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. శాంతిపురం, కుప్పం, రామకుప్పంతోపాటు వి.కోట మండలాల పరిధిలో పాలారు నదిపై 17 చెక్ డ్యాముల పునర్నిర్మాణానికి రూ.5355 లక్షలకు పరిపాలనా ఆమోదం ఇవ్వడానికి ఈనెల 21వ తేదీన నీటి వనరుల శాఖ ప్రతిపాదనలు పంపింది. ఈ పనులతోపాటు ఇదే నదిపై మరో 4 చెక్ డ్యాముల మరమ్మతు పనులకు కూడా రూ.1024,50 లక్షలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కుప్పం నియోజకవర్గంలో స్వర్ణ రోడ్ మ్యాప్ టు కుప్పం 2029 కింద నియోజకవర్గంలోని గుడుపల్లె, శాంతిపురం, కుప్పం మండలాల్లో 51 మైనర్ ఇరిగేషన్ చెరువుల మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు రూ.1422.15 లక్షలకు పరిపాలనా అనుమతుల ప్రతిపాదనకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
రూ.14.22 కోట్లతో 51 చెరువులకు మరమ్మతులు
కుప్పం, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): కుప్పం నియోజకవర్గంలో 67కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. శాంతిపురం, కుప్పం, రామకుప్పంతోపాటు వి.కోట మండలాల పరిధిలో పాలారు నదిపై 17 చెక్ డ్యాముల పునర్నిర్మాణానికి రూ.5355 లక్షలకు పరిపాలనా ఆమోదం ఇవ్వడానికి ఈనెల 21వ తేదీన నీటి వనరుల శాఖ ప్రతిపాదనలు పంపింది. ఈ పనులతోపాటు ఇదే నదిపై మరో 4 చెక్ డ్యాముల మరమ్మతు పనులకు కూడా రూ.1024,50 లక్షలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కుప్పం నియోజకవర్గంలో స్వర్ణ రోడ్ మ్యాప్ టు కుప్పం 2029 కింద నియోజకవర్గంలోని గుడుపల్లె, శాంతిపురం, కుప్పం మండలాల్లో 51 మైనర్ ఇరిగేషన్ చెరువుల మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు రూ.1422.15 లక్షలకు పరిపాలనా అనుమతుల ప్రతిపాదనకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమం అమలు ద్వారా కుప్పం నియోజకవర్గంలో పైన పేర్కొన్న మూడు మండలాల్లో రైతులకు మేలు చేకూర్చేవిధంగా 16,544.76 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లభించనుంది. అలాగే ఏపీ హైకోర్టుతోపాటు కుప్పంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లకు సంబంధించి తీసుకున్న చర్యలను ధృవీకరించేందుకు చేసిన ప్రతిపాదనలను సైతం క్యాబినెట్ ఆమోదించింది.