Share News

మాధవమాలలో కొయ్య బొమ్మల తయారీ రా మెటీరియల్‌ బ్యాంకు

ABN , Publish Date - Sep 15 , 2025 | 01:22 AM

ఏర్పేడు మండలం మాధవమాలలో కొయ్య బొమ్మల తయారీ కళాకారులకు కావాల్సిన రా మెటీరియల్‌ బ్యాంకును త్వరలో ఏర్పాటు చేస్తామని ఏపీ ఫారెస్టు డెవల్‌పమెంట్‌ యాక్టివిటీస్‌ సలహాదారు మల్లికార్జునరావు తెలిపారు.

మాధవమాలలో కొయ్య బొమ్మల తయారీ రా మెటీరియల్‌ బ్యాంకు

ఏర్పేడు, సెప్టెంబరు 14(ఆంద్రజ్యోతి): ఏర్పేడు మండలం మాధవమాలలో కొయ్య బొమ్మల తయారీ కళాకారులకు కావాల్సిన రా మెటీరియల్‌ బ్యాంకును త్వరలో ఏర్పాటు చేస్తామని ఏపీ ఫారెస్టు డెవల్‌పమెంట్‌ యాక్టివిటీస్‌ సలహాదారు మల్లికార్జునరావు తెలిపారు. మాధవమాలలోని బాలాజీ ఉడ్‌ కార్వింగ్‌ సొసైటీని ఆదివారం ఆయన సందర్శించారు. కొయ్య బొమ్మలను పరిశీలించారు. భాకరాపేట నుంచి తిరుపతికి ప్రధాన రహదారిని అటవీప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఈ రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్లను ప్రభుత్వం తొలగిస్తుందన్నారు. ఆ దుంగలను మాధవమాలలో స్టాక్‌పెట్టి రా మెటీరియల్‌ బ్యాంకుగా ఏర్పాటు చేస్తుందన్నారు. వాటితో కళాకారులు బొమ్మలు తదితరాలను తయారు చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చన్నారు. ఐదేళ్ల వరకుఉ రా మెటీరియల్‌ అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎ్‌ఫవో వివేక్‌, ఐఎ్‌ఫఎస్‌ సబ్‌ డీఎఫ్‌ నాగభూషణం, ఎఫ్‌ఆర్‌వో సుదర్శన్‌రెడ్డి, మాజీ డీఎ్‌ఫవో కృష్ణయ్యరెడ్డి, శాండిల్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ రవికుమార్‌రాజు, బాలాజీ ఉడ్‌ కార్వింగ్‌ సొసైటీ అధ్యక్షుడు రాజాచారి, సీఈవో కృష్ణమూర్తి, రెడ్‌ శాండిల్‌ అసోసియేషన్‌ మెంబర్‌ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 15 , 2025 | 01:22 AM