Share News

చిత్తూరు అభివృద్ధికి వేగంగా అడుగులు

ABN , Publish Date - Sep 25 , 2025 | 02:41 AM

చిత్తూరు నగర అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. హైరోడ్డును విస్తరించే క్రమంలో మున్సిపల్‌ అధికారులు విడతల వారీగా ఆక్రమణల్ని తొలగిస్తున్నారు. తాజాగా గాంధీ రోడ్డు అభివృద్ధి కోసం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బుధవారం ఈ పనుల్ని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ పరిశీలించారు. ఈ రోడ్డులోని విద్యుత్తు స్తంభాలను, ఆక్రమణలను కమిషనర్‌ నరసింహ ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఏసీపీ నాగేంద్ర తొలగింపజేశారు.ఇటీవల కట్టమంచి బైపాస్‌ పనులకు ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్యే జగన్మోహన్‌ శంకుస్థాపన చేయగా, 3 నెలల్లో ఈ పనులు పూర్తి కానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి చిత్తూరుతో పాటు కుప్పంలోనూ కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

చిత్తూరు అభివృద్ధికి వేగంగా అడుగులు
చిత్తూరులో బుధవారం గాంధీ రోడ్డు అభివృద్ధి పనుల్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌, కమిషనర్‌

చిత్తూరు, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు నగర అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. హైరోడ్డును విస్తరించే క్రమంలో మున్సిపల్‌ అధికారులు విడతల వారీగా ఆక్రమణల్ని తొలగిస్తున్నారు. తాజాగా గాంధీ రోడ్డు అభివృద్ధి కోసం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బుధవారం ఈ పనుల్ని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ పరిశీలించారు. ఈ రోడ్డులోని విద్యుత్తు స్తంభాలను, ఆక్రమణలను కమిషనర్‌ నరసింహ ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఏసీపీ నాగేంద్ర తొలగింపజేశారు.ఇటీవల కట్టమంచి బైపాస్‌ పనులకు ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్యే జగన్మోహన్‌ శంకుస్థాపన చేయగా, 3 నెలల్లో ఈ పనులు పూర్తి కానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి చిత్తూరుతో పాటు కుప్పంలోనూ కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - Sep 25 , 2025 | 02:41 AM