Share News

తోతాపురి ధరలు తగ్గిస్తే ర్యాంపులు సీజ్‌

ABN , Publish Date - Jun 25 , 2025 | 01:42 AM

తోతాపురి రకం మామిడి కాయల కొనుగోలు ధరలు తగ్గిస్తే ర్యాంపులు సైతం సీజ్‌ చేసేందుకు మార్కెటింగ్‌ శాఖ అధికారులు సిద్ధమయ్యారు. జిల్లాలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న 35 ర్యాంపుల్లో ప్రస్తుతం 23 ర్యాంపుల్లో మామిడి క్రయ, విక్రయాలు సాగుతున్నాయి.ర్యాంపుల్లో కిలో 4రూపాయలుగా వున్న ధరలు సోమవారం రూపాయి పతనమై రూ.3కు చేరుకున్నాయి. దీనిపై కలెక్టర్‌, మార్కెటింగ్‌ అధికారులు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. జిల్లావ్యాప్తంగా ర్యాంపులకు మామిడి సరఫరా అధికం కావడంతో మంగళవారం మరో రూపాయి పతనమై చివరకు రూ.2కు చేరింది. దీనిపై ఇటు కలెక్టర్‌, అటు మార్కెటింగ్‌ శాఖ అధికారులు సీరియస్‌ అయ్యారు. ధర మరింత పతనం కావడంతో తవణంపల్లె మండలం గాజులపల్లెలోని తిరుమల ర్యాంపు వద్ద రహదారిపై రైతులు బైఠాయించి నిరసనలు చేపట్టారు. సమాచారం అందుకున్న మార్కెటింగ్‌ శాఖ ఏడీ పరమేశ్వరన్‌ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని కనీస ధర రూ.4కు కొనుగోలు చేయాలని ర్యాంపు నిర్వాహకులపై ఒత్తిడి తెచ్చారు. తమకు నష్టం వస్తుందని, రూ.2కే కొనుగోలు చేస్తామని నిర్వాహకులు చెప్పడంతో, ర్యాంపును సీజ్‌ చేస్తామని ఏడీ హెచ్చరించారు. ఈ విషయాన్ని ఇటు అధికారులు, అటు రైతులు కలెక్టర్‌ దృష్టికి తీసుకుపోయారు. సమస్య తీవ్రతరం కావడంతో రైతుల అభ్యర్థన మేరకు 50 పైసలు పెంచి చివరకు రూ.రెండున్నర నిర్ణయించడంతో ర్యాంపులో లావాదేవీలు కొనసాగాయి. కాగా ధరలు మరింత తగ్గిస్తే ర్యాంపులు సీజ్‌ చేస్తామని ఏడీ హెచ్చరించారు.

తోతాపురి ధరలు తగ్గిస్తే ర్యాంపులు సీజ్‌
ర్యాంపు నిర్వాహకులతో మాట్లాడుతున్న మార్కెటింగ్‌ శాఖ ఏడీ పరమేశ్వరన్‌

- మార్కెటింగ్‌ శాఖ అధికారుల హెచ్చరిక

- అయినా మరో కిలోకి 50 పైసలు పతనం

చిత్తూరు సెంట్రల్‌, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి):తోతాపురి రకం మామిడి కాయల కొనుగోలు ధరలు తగ్గిస్తే ర్యాంపులు సైతం సీజ్‌ చేసేందుకు మార్కెటింగ్‌ శాఖ అధికారులు సిద్ధమయ్యారు. జిల్లాలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న 35 ర్యాంపుల్లో ప్రస్తుతం 23 ర్యాంపుల్లో మామిడి క్రయ, విక్రయాలు సాగుతున్నాయి.ర్యాంపుల్లో కిలో 4రూపాయలుగా వున్న ధరలు సోమవారం రూపాయి పతనమై రూ.3కు చేరుకున్నాయి. దీనిపై కలెక్టర్‌, మార్కెటింగ్‌ అధికారులు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. జిల్లావ్యాప్తంగా ర్యాంపులకు మామిడి సరఫరా అధికం కావడంతో మంగళవారం మరో రూపాయి పతనమై చివరకు రూ.2కు చేరింది. దీనిపై ఇటు కలెక్టర్‌, అటు మార్కెటింగ్‌ శాఖ అధికారులు సీరియస్‌ అయ్యారు. ధర మరింత పతనం కావడంతో తవణంపల్లె మండలం గాజులపల్లెలోని తిరుమల ర్యాంపు వద్ద రహదారిపై రైతులు బైఠాయించి నిరసనలు చేపట్టారు. సమాచారం అందుకున్న మార్కెటింగ్‌ శాఖ ఏడీ పరమేశ్వరన్‌ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని కనీస ధర రూ.4కు కొనుగోలు చేయాలని ర్యాంపు నిర్వాహకులపై ఒత్తిడి తెచ్చారు. తమకు నష్టం వస్తుందని, రూ.2కే కొనుగోలు చేస్తామని నిర్వాహకులు చెప్పడంతో, ర్యాంపును సీజ్‌ చేస్తామని ఏడీ హెచ్చరించారు. ఈ విషయాన్ని ఇటు అధికారులు, అటు రైతులు కలెక్టర్‌ దృష్టికి తీసుకుపోయారు. సమస్య తీవ్రతరం కావడంతో రైతుల అభ్యర్థన మేరకు 50 పైసలు పెంచి చివరకు రూ.రెండున్నర నిర్ణయించడంతో ర్యాంపులో లావాదేవీలు కొనసాగాయి. కాగా ధరలు మరింత తగ్గిస్తే ర్యాంపులు సీజ్‌ చేస్తామని ఏడీ హెచ్చరించారు.

Updated Date - Jun 25 , 2025 | 01:42 AM