Share News

ద్రావిడ వర్సిటీకి రామకృష్ణారెడ్డి సేవలు ఎనలేనివి

ABN , Publish Date - Apr 25 , 2025 | 02:08 AM

ద్రావిడ విశ్వవిద్యాలయానికి తొలి రిజిస్ట్రార్‌గా పనిచేసిన పద్మశ్రీ రామకృష్ణారెడ్డి సేవలు ఎనలేనివని ఇన్‌చార్జి వీసీ ఆచార్య దొరస్వామి తెలిపారు. గురువారం ద్రావిడ వర్సిటీలోని ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుట రామకృష్ణారెడ్డి సంతాప సభ నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి ఇన్‌చార్జి వీసీతోపాటు ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ ఆచార్య కిరణ్‌ కుమార్‌, డీన్‌ ఆచార్య శ్యామల, అధ్యాపకులు, ఉద్యోగులు పూలమాల వేసి, నివాళి అర్పించారు. పలువురు ఉద్యోగులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ అధ్యాపకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

ద్రావిడ వర్సిటీకి రామకృష్ణారెడ్డి సేవలు ఎనలేనివి
ద్రావిడ వర్సిటీ వ్యవస్థాపక రిజిస్ట్రార్‌కు పద్మశ్రీ డాక్టర్‌ బి రామకృష్ణారెడ్డి చిత్ర పటానికి నివాళులర్పిస్తున్న ఇంచార్జి వీసీ దొరస్వామి

గుడుపల్లె, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): ద్రావిడ విశ్వవిద్యాలయానికి తొలి రిజిస్ట్రార్‌గా పనిచేసిన పద్మశ్రీ రామకృష్ణారెడ్డి సేవలు ఎనలేనివని ఇన్‌చార్జి వీసీ ఆచార్య దొరస్వామి తెలిపారు. గురువారం ద్రావిడ వర్సిటీలోని ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుట రామకృష్ణారెడ్డి సంతాప సభ నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి ఇన్‌చార్జి వీసీతోపాటు ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ ఆచార్య కిరణ్‌ కుమార్‌, డీన్‌ ఆచార్య శ్యామల, అధ్యాపకులు, ఉద్యోగులు పూలమాల వేసి, నివాళి అర్పించారు. పలువురు ఉద్యోగులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ అధ్యాపకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2025 | 02:08 AM