31 మండలాల్లో వర్షాలు
ABN , Publish Date - Oct 24 , 2025 | 01:11 AM
నైరుతి రుతుపవనాల రాక నేపథ్యంలో ఉపరితల ఆవర్తన కారణంగా గడిచిన 24 గంటల్లో బంగారుపాళ్యం మినహా 31 మండలాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి.
చిత్తూరు కలెక్టరేట్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి):నైరుతి రుతుపవనాల రాక నేపథ్యంలో ఉపరితల ఆవర్తన కారణంగా గడిచిన 24 గంటల్లో బంగారుపాళ్యం మినహా 31 మండలాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా నిండ్రలో 83.4 మిమీ, అత్యల్పంగా పెద్దపంజాణిలో 2.6 మిమీ వర్షపాతం నమోదయ్యింది. మండలాలవారీగా కుప్పంలో 35.2, విజయపురంలో 34.4, నగరిలో 28.8, శ్రీరంగరాజపురంలో 26.8, పాలసముద్రంలో 26.6, గుడుపల్లెలో 23.6, సోమలలో 14.6, ఐరాలలో 13, శాంతిపురంలో 12.4, రామకుప్పంలో 12, కార్వేటినగరంలో 11.6, వెదురుకుప్పంలో 11.2, వి.కోటలో 11, పులిచెర్లలో 10.4, పుంగనూరులో 9.6, రొంపిచెర్లలో 8.6, సదుం, పూతలపట్టు మండలాల్లో 8.2, చౌడేపల్లెలో 7.6, గుడిపాలలో 6.8, పెనుమూరులో 6, చిత్తూరు రూరల్‌లో 5.8, తవణంపల్లెలో 5.6, చిత్తూరు అర్బన్‌లో 5, యాదమరి, గంగాధరనెల్లూరు మండలాల్లో 4.8, బైరెడ్డిపల్లిలో 4.6, గంగవరం, పలమనేరు మండలాల్లో 3 మిమీ వర్షం కురిసింది.
177 ఎకరాల్లో వరి పంటకు నష్టం
చిత్తూరు సెంట్రల్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): వర్షాల కారణంగా జిల్లాలో 177 ఎకరాల్లోని వరి పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖాధికారులు లెక్క కట్టారు. 12 మండలాల పరిధిలోని 32 గ్రామాల్లో 172 మంది రైతులు సాగు చేసిన వరి పంట దెబ్బతిన్నట్లు గుర్తించారు. అత్యధికంగా పెనుమూరు మండలంలో 70 ఎకరాల్లో పైరు దెబ్బతినగా, చౌడేపల్లె మండలంలోని ఒకే గ్రామంలో 40 ఎకరాలు, యాదమరి మండలంలోని ఐదు గ్రామాల్లో 12.25 ఎకరాలు సాగు చేసిన వరి పైరు దెబ్బతింది.
పంట నష్టం జరక్కుండా చూడండి:సీఎం
చిత్తూరు కలెక్టరేట్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): వర్షాలతో పంట నష్టం జరక్కుండా చూడాలని సీఎం చంద్రబాబు జిల్లా యంత్రాంగానికి సూచించారు.గురువారం దుబాయ్ నుంచి వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు నుంచి పాల్గొన్న కలెక్టర్ సుమిత్‌కుమార్ జిల్లాలో చేపట్టిన చర్యలను వివరించారు. నగరి మండలంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యిందని, ఎక్కడా వర్షపునీరు నిల్వలేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.సీఎం మాట్లాడుతూ అంటువ్యాధులు ప్రబలకుండా వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని,విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా చూడాలని సూచించారు. ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహాలతో చెరువులు నింపేందుకు చర్యలు చేపట్టాలన్నారు.