జూపల్లిలో గజరాజుల దాడులు
ABN , Publish Date - Oct 20 , 2025 | 02:20 AM
పులిచెర్ల మండలంలో పంటలపై ఏనుగుల గుంపు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మండలంలోని పాళెం పంచాయతీలో శనివారం రాత్రి ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేయడంతో అపారనష్టం వాటిల్లింది. తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని బోదబండ నుంచి శనివారం రాత్రి బయలుదేరిన 7 ఏనుగుల గుంపు అటవీ సరిహద్దులో ఉన్న పాళెం పంచాయతీ జూపల్లి వద్దకు చేరుకున్నాయి. గ్రామంలోని రైతులు శివయ్య, రఘు, జయపాల్, మునస్వామి, మోహన్, సుబ్బరత్నకు చెందిన మామిడిచెట్ల కొమ్మలను ఏనుగుల గుంపు పూర్తిగా విరిచేశాయి. కొబ్బరిచెట్లను ధ్వంసం చేశాయి. పశుగ్రాసాన్ని తినేశాయి. పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపును గమనించిన గ్రామస్తులు టపాకాయలు పేల్చారు. టపాకాయలు శబ్ధాలు వినడంతో ఏనుగుల గుంపు వచ్చిన మార్గంలోనే తిరిగి అడవిలోకి వెళ్లిపోయాయి. ఆదివారం పగలంతా అడవిలోని సూరప్పచెరువు వద్ద ఏనుగుల గుంపు తిష్ట వేసినట్లు ప్రజలు తెలిపారు. అటవీ సరిహద్దు గ్రామాలకు సమీపంలోని అడవిలో ఏనుగుల గుంపు తిష్ట వేశాయని, దీంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఎఫ్‌వో మహమ్మద్ షఫి, ఎఫ్‌బీవో మధు హెచ్చరించారు.
కల్లూరు, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): పులిచెర్ల మండలంలో పంటలపై ఏనుగుల గుంపు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మండలంలోని పాళెం పంచాయతీలో శనివారం రాత్రి ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేయడంతో అపారనష్టం వాటిల్లింది. తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని బోదబండ నుంచి శనివారం రాత్రి బయలుదేరిన 7 ఏనుగుల గుంపు అటవీ సరిహద్దులో ఉన్న పాళెం పంచాయతీ జూపల్లి వద్దకు చేరుకున్నాయి. గ్రామంలోని రైతులు శివయ్య, రఘు, జయపాల్, మునస్వామి, మోహన్, సుబ్బరత్నకు చెందిన మామిడిచెట్ల కొమ్మలను ఏనుగుల గుంపు పూర్తిగా విరిచేశాయి. కొబ్బరిచెట్లను ధ్వంసం చేశాయి. పశుగ్రాసాన్ని తినేశాయి. పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపును గమనించిన గ్రామస్తులు టపాకాయలు పేల్చారు. టపాకాయలు శబ్ధాలు వినడంతో ఏనుగుల గుంపు వచ్చిన మార్గంలోనే తిరిగి అడవిలోకి వెళ్లిపోయాయి. ఆదివారం పగలంతా అడవిలోని సూరప్పచెరువు వద్ద ఏనుగుల గుంపు తిష్ట వేసినట్లు ప్రజలు తెలిపారు. అటవీ సరిహద్దు గ్రామాలకు సమీపంలోని అడవిలో ఏనుగుల గుంపు తిష్ట వేశాయని, దీంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఎఫ్‌వో మహమ్మద్ షఫి, ఎఫ్‌బీవో మధు హెచ్చరించారు.