పాఠశాలల సమూల మార్పులకు శ్రీకారం
ABN , Publish Date - May 14 , 2025 | 12:36 AM
జాతీయ విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా పాఠశాలలకు సంబంధించి విద్యాశాఖ సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది.ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడం, డ్రాపౌట్లను తగ్గించడం, సబ్జెక్టు ఉపాధ్యాయులకు పనిభారాన్ని తగ్గిచడం, విద్యార్థుల అభ్యాస ఫలితాలు మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టనున్నారు.ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 162 ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేయనున్నారు.
తొమ్మిది రకాలుగా స్కూళ్ల విభజన
162 పాఠశాలల ఉన్నతీకరణ
పలు టీచర్ల పోస్టుల్లో సైతం మార్పులు
చిత్తూరు సెంట్రల్, మే 13 (ఆంధ్రజ్యోతి) : జాతీయ విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా పాఠశాలలకు సంబంధించి విద్యాశాఖ సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది.ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడం, డ్రాపౌట్లను తగ్గించడం, సబ్జెక్టు ఉపాధ్యాయులకు పనిభారాన్ని తగ్గిచడం, విద్యార్థుల అభ్యాస ఫలితాలు మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టనున్నారు.ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 162 ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేయనున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రాథమిక, ప్రాఽథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 4,719వున్నాయి.17,372 టీచర్లు పోస్టులు మంజూరు కాగా, ప్రస్తుతం 15,454 మంది టీచర్లు పనిచేస్తున్నారు.1918 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 723మంది ఉపాధ్యాయులుండగా, ఎంపీపీ/జడ్పీ పాఠశాలల్లో 15,552 మంది, మున్సిపల్ పాఠశాలల్లో 589మంది, మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో 508 మంది టీచర్లు పనిచేస్తున్నారు. గత నాలుగు నెలల కాలంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 4719 పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను విద్యాశాఖ చేపట్టింది.కలెక్టర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ ప్రక్రియలో విద్యాశాఖ అధికారులు డీఈవో, డీవైఈవో, ఎంఈవోలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అంగన్‌వాడీల నుంచి ఇంటర్మీడియట్ విద్య వరకు ప్రభుత్వ,జడ్పీ, ఎంపీపీ, మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలను తొమ్మిది రకాలుగా విభజిస్తున్నారు.
1.శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లు (ప్రీ ప్రైమరీ, ప్రైమరీ (అంగన్‌వాడీలు) -58
2.ఫౌండేషన్ స్కూళ్లు (ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, ఒకటి, రెండు తరగతులు) - 991
3.బేసిక్ ప్రైమరీ స్కూళ్లు (ప్రీ ప్రైమరీ, ప్రైమరీ 1-5 తరగతులు) -2018
4.మోడల్ ప్రైమరీ స్కూళ్లు (ప్రీ ప్రైమరీ, ప్రైమరీ 1-5 తరగతులు) -928
5.అప్పర్ ప్రైమరీ స్కూళ్లు (ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, 1-8 తరగతులు) -70
6. హైస్కూళ్లు (6-10 తరగతులు) -526
7. హైస్కూళ్లు (1-10 తరగతులు) -71
8.హైస్కూల్ ప్లస్ (6-12 తరగతులు) + బేసిక్ ప్రైమరీ స్కూళ్లు
9.హైస్కూల్ ప్లస్ (1-12 తరగతులు) + మోడల్ ప్రైమరీ స్కూళ్లు -57
-----------------------------------------------------------------------------------------------------
మొత్తం 4719
-----------------------------------------------------------------------------------------------------
పాఠశాలల్లో సిబ్బంది
ప్రీ ప్రైమరీ పాఠశాల(ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, 1-5 తరగతులు)ల్లో 1నుంచి 30మంది విద్యార్థులుంటే ఒక సెకండరీ గ్రేడ్ టీచర్, 31నుంచి 60 మంది దాకా ఉంటే ఇద్దరు సెకండరీ గ్రేడ్ టీచర్లను కేటాయిస్తారు.ఫ మోడల్ ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో 1నుంచి 59 మంది విద్యార్థులుంటే మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్‌ఎం/స్కూల్ అసిస్టెంట్, ముగ్గురు ఎస్జీటీలను కేటాయిస్తారు. 60నుంచి 150మంది దాకా విద్యార్థులుంటే ఒక మోడల్ స్కూల్ ప్రైమరీ స్కూల్ హెచ్‌ఎం/స్కూల్ అసిస్టెంట్, నలుగురు ఎస్జీటీలను కేటాయిస్తారు. 150కి పైగా విద్యార్థులుంటే ప్రతి 30 మంది విద్యార్థులకు అదనంగా ఒక ఎస్జీటీని కేటాయిస్తారు.ఫఉన్నత పాఠశాల (6-8 తరగతులు)- 1నుంచి 10మంది విద్యార్థులకు ఒక స్కూల్ అసిస్టెంట్, 11నుంచి 30 మంది విద్యార్థులకు ఇద్దరు ఎస్‌ఏలు, 31నుంచి 140 వరకు నలుగురు ఎస్‌ఏలు,141 నుంచి 175 వరకు విద్యార్థులుంటే ఐదుగురు ఎస్‌ఏలను కేటాయిస్తారు. ఫ 75మంది విద్యార్థులున్న ఉన్నత పాఠశాలల్లో సీనియర్ ఎస్‌ఏ హెచ్‌ఎంగా వ్యవహరిస్తారు.ఫ క్లస్టర్ ఉన్నత పాఠశాలల్లో ఒక హెచ్‌ఎం, ఒక ఎస్(పీఈ)/పీఈటీ పోస్టు కేటాయిస్తారు. 76కంటే ఎక్కువమంది విద్యార్థులుంటే హెచ్‌ఎం, ఎస్‌ఏ(పీఈ)/పీఈటీ పోస్టులు కేటాయిస్తారు.ఫ 400 మంది విద్యార్థుల కంటే ఎక్కువ ఉంటే రెండు ఎస్‌ఏ, 751 మంది నమోదైతే 3వ ఎస్‌ఏ పోస్టు కేటాయిస్తారు. ఇలా 350మంది విద్యార్థులకు ఒక ఎస్‌ఏ పోస్టు కేటాయిస్తారు.
టీచర్ల కేడర్లలోనూ మార్పులు
స్కూల్ అసిస్టెంట్ పోస్టులను మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్‌ఎంలుగా మార్చారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎంపీపీ/జడ్పీ యాజమాన్యాల్లో 612మంది, మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆరుగురు ఉన్నారు. ఫ క్లస్టర్ స్థాయిలో వర్కింగ్ సర్ప్లస్ స్కూల్ అసిస్టెంట్/సెకండరీ గ్రేడ్ టీచర్, తత్సమాన పోస్టులను క్లస్టర్ లెవల్ అకడమిక్ టీచర్లుగా ఉపయోగించుకోనున్నారు. ఎంపీపీ/జడ్పీ యాజమాన్యాల్లో స్కూల్ అసిస్టెంట్లు 134మంది ఉండగా, ప్రభుత్వ యాజమాన్యంలో 6, మున్సిపల్ కార్పొరేషన్‌లో 8 మంది ఉన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా విద్యాశాఖలోని డీఈవో పూల్లో 217 మంది టీచర్లున్నారు. 65మంది హెచ్‌ఎంలు, 195మంది స్కూల్ అసిస్టెంట్లు, 11మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు ఉన్నారు. వీరిని సైతం సర్దుబాటు చేయనున్నారు.