తిరుమలేశుడి సేవలో పీవీ సింధు
ABN , Publish Date - Dec 25 , 2025 | 01:30 AM
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, భర్త వెంకట దత్తసాయి, కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల, డిసెంబరు24(ఆంధ్రజ్యోతి): బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, భర్త వెంకట దత్తసాయి, కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ.. తమ వివాహం జరిగి ఏడాదైన సందర్భంగా స్వామిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నామన్నారు. వైజాగ్‌లో నిర్మాణంలో ఉన్న అకాడమీ పనులు త్వరగా పూర్తికావాలని కోరుకున్నట్టు చెప్పారు.