Share News

న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి

ABN , Publish Date - Oct 12 , 2025 | 01:58 AM

న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని న్యాయమూర్తులకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణమోహన్‌ సూచించారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని న్యాయమూర్తులతో ఆయన సమీక్షించారు.

న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణమోహన్‌కు మొక్కను బహూకరిస్తున్న డీజే అరుణసారిక

న్యాయమూర్తులకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణమోహన్‌ సూచన

చిత్తూరు లీగల్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని న్యాయమూర్తులకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణమోహన్‌ సూచించారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని న్యాయమూర్తులతో ఆయన సమీక్షించారు. న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కుదిరేలా తీర్పులు ఉండాలన్నారు. చట్టాలపై సమగ్రంగా అవగాహన పెంచుకోవాలని చెప్పారు. పెండింగ్‌ కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు. అనంతరం తీర్పులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారికతోపాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు.

Updated Date - Oct 12 , 2025 | 01:58 AM