Share News

అవినీతి రహిత పాలన అందిస్తా

ABN , Publish Date - Jun 05 , 2025 | 01:30 AM

ఉమ్మడి చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) బలోపేతానికి కృషి చేస్తూనే.. అవినీతి రహిత పాలన అందిస్తామని పర్సన్‌ ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించిన అమాస రాజశేఖర్‌ రెడ్డి స్పష్టం చేశారు.

అవినీతి రహిత పాలన అందిస్తా
బాధ్యతలు స్వీకరిస్తున్న అమాస రాజశేఖర్‌ రెడ్డి, పక్కన చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్‌, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, టీడీపీ సీనియర్‌ నాయకుడు చంద్రప్రకాష్‌ తదితరులు

- రాష్ట్రస్థాయిలో చిత్తూరు డీసీసీబీని ప్రథమ స్థానంలో నిలుపుతా

- పర్సన్‌ ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించిన అమాస రాజశేఖర్‌రెడ్డి

చిత్తూరు కలెక్టరేట్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) బలోపేతానికి కృషి చేస్తూనే.. అవినీతి రహిత పాలన అందిస్తామని పర్సన్‌ ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించిన అమాస రాజశేఖర్‌ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం చిత్తూరులోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో పర్సన్‌ ఇన్‌చార్జిగా అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అమాస ప్రసంగించారు. గత అనుభవాలను బేరీజు వేసుకుంటూ రాష్ట్రస్థాయిలో చిత్తూరు డీసీసీబీని ప్రథమ స్థానంలో నిలుపుతానని చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల సహకారంతో బ్యాంకు అభివృద్ధికి కృషి చేస్తామని, రైతులకు మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్‌ మాట్లాడుతూ.. తిరోగమనం పట్టిన బ్యాంకును గాడిలో పెట్టి పూర్వవైభవం తేవాలని సూచించారు. బ్యాంకు అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్‌ హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ.. ఐదేళ్ల వైసీపీ పాలనలో అప్పటి పాలకవర్గం కోట్లాది రూపాయిలను దోపిడీ చేసిందన్నారు. దీనిపై తాను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా, ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌, పులివర్తి నాని, చిత్తూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు సీఆర్‌ రాజన్‌, ఏపీ గ్రీనరీ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ సుగుణమ్మ, చుడా చైర్‌పర్సన్‌ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, టీడీపీ నాయకులు సురేంద్రకుమార్‌, చంద్రప్రకాష్‌, చెరుకూరి వసంత్‌కుమార్‌, ఎన్‌పీ జయప్రకాష్‌, బాలాజీ నాయుడు (గుడిపాల మాజీ జడ్పీటీసీ), జేఎంసీ శివ, కోదండ యాదవ్‌, బీజేపీ నాయకులు నవీన్‌కుమార్‌ (తిరుపతి), కొత్తూరు బాబు, హరిబాబు చౌదరి, దొడ్డారెడ్డి సిద్దారెడ్డి (తిరుపతి), తిరుపతి డిప్యూటీ మేయర్‌ ఆర్సీ మునికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఘన స్వాగతం, అభినందనలు

తొలుత బ్యాంకు ప్రధాన కార్యాలయానికి విచ్చేసిన అమాసకు సీఈవో శంకర్‌బాబు, జీఎంలు మనోహర్‌ గౌడ్‌, లిల్లీకేథరిన్‌, ఏజీఎం సురేష్‌ బాబు, బ్యాంకు లీగల్‌ ఆఫీసర్‌ గంగిరెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. బ్యాంకు ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు రఘుబాబు, గంగిరెడ్డి, సభ్యులు గణేష్‌, సురేష్‌, ఉమ్మడి జిల్లా నుంచి విచ్చేసిన టీడీపీ సీనియర్‌ నాయకులు, సింగిల్‌ విండోల మాజీ అధ్యక్షులు అభినందనలు తెలిపారు. కాగా, డీసీసీబీలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి నాయకులతో కలిసి అమాస గజమాల వేసి, నివాళి అర్పించారు. అమాసకు ఫోన్‌ ద్వారా మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్‌కుమార్‌ రెడ్డి, పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథ రెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Jun 05 , 2025 | 01:31 AM