Share News

తాబేళ్ల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

ABN , Publish Date - Apr 10 , 2025 | 02:15 AM

అంతరించిపోతున్న తాబేళ్ల జాతిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ అన్నారు. చిల్లకూరు మండలం గుమ్మళ్లదిబ్బ బీచ్‌ వద్ద బుధవారం జిందాల్‌ పరిశ్రమ ఆధ్వర్యంలో ఆలీవ్‌ రెడ్లీ జాతి తాబేళ్లను సముద్రంలోకి వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ సమత్యులతను కాపాడే తాబేళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత అటవీశాఖ అధికారులతోపాటు మత్స్యకారులు, స్థానికులపైనా ఉందన్నారు. సముద్రంలో కొన్ని వేల కిలోమీటర్లు తాబేళ్లు ప్రయాణించి తీరప్రాంతాలకు వచ్చి గుడ్లు పెడతాయన్నారు. వాటిని కాపాడుకుని తాబేళ్ల ఉత్పత్తి, పరిరక్షణకు కృషి చేయాలని కోరారు.

తాబేళ్ల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
గుమ్మళ్లదిబ్బ వద్ద సముద్రంలోకి తాబేళ్లను వదులుతున్న కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, అటవీశాఖ అధికారి వివేక్‌ తదితరులు

తాబేళ్ల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

చిల్లకూరు, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): అంతరించిపోతున్న తాబేళ్ల జాతిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ అన్నారు. చిల్లకూరు మండలం గుమ్మళ్లదిబ్బ బీచ్‌ వద్ద బుధవారం జిందాల్‌ పరిశ్రమ ఆధ్వర్యంలో ఆలీవ్‌ రెడ్లీ జాతి తాబేళ్లను సముద్రంలోకి వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ సమత్యులతను కాపాడే తాబేళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత అటవీశాఖ అధికారులతోపాటు మత్స్యకారులు, స్థానికులపైనా ఉందన్నారు. సముద్రంలో కొన్ని వేల కిలోమీటర్లు తాబేళ్లు ప్రయాణించి తీరప్రాంతాలకు వచ్చి గుడ్లు పెడతాయన్నారు. వాటిని కాపాడుకుని తాబేళ్ల ఉత్పత్తి, పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. అంతరించిపోతున్న తాబేళ్లను సంరక్షించుకుంటే వాటి ద్వారా మానవ మనుగడకు, ప్రకృతికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణతోపాటు మత్స్యసంపద ఉత్పత్తికీ తాబేళ్లు దోహదపడతాయని జిల్లా అటవీశాఖ అధికారి వివేక్‌ తెలిపారు. గుమ్మళ్లదిబ్బ బీచ్‌ను బెస్ట్‌ రిసార్ట్‌ ప్రాంతంగా మార్చుకునేందుకు కృషి చేద్దామన్నారు. తాబేళ్ల ఉత్పత్తికి కృషిచేస్తున్న అటవీశాఖ అధికారులకు జ్ఞాపికలు అందించి కలెక్టర్‌ సత్కరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు శ్రీనివాసులు, ఎంపీడీవో గోపి, అటవీశాఖ అధికారులు శ్రీనివాసులు, గోపి, రమణయ్య, జిందాల్‌ పరిశ్రమ ప్రతినిధి శ్రీనివాస్‌, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఉచ్చూరు వెంకటేశ్వర్లురెడ్డి, సతీ్‌షయాదవ్‌, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

కోట, ఆంధ్రజ్యోతి: కోట మండలం శ్రీనివాససత్రం వద్ద సముద్రంలోకి బుధవారం 150 తాబేళ్లను కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ వదిలారు. ఈ ఆలీవ్‌రెడ్లీ తాబేళ్లతో జరిగే పర్యావరణ సమతుల్యంపై మత్స్యకారులకు అవగాహన కల్పించారు.

Updated Date - Apr 10 , 2025 | 02:15 AM