Share News

అగ్ని ప్రమాదంలో రూ.5లక్షల ఆస్తి నష్టం

ABN , Publish Date - Nov 01 , 2025 | 01:59 AM

పెట్రోల్‌ చిల్లర అమ్మకాలతో ఓ ఇల్లు అగ్నికి ఆహుతైంది.చౌడేపల్లె మండలం కాగతిలో శారదమ్మ ఇంటి వద్దే కిరాణా దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తోంది.పల్లెలో ద్విచక్ర వాహనాలుండడంతో దుకాణంలో పెట్రోల్‌ కూడా విక్రయిస్తుండేది.

అగ్ని ప్రమాదంలో రూ.5లక్షల ఆస్తి నష్టం

చౌడేపల్లె, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి) : పెట్రోల్‌ చిల్లర అమ్మకాలతో ఓ ఇల్లు అగ్నికి ఆహుతైంది.చౌడేపల్లె మండలం కాగతిలో శారదమ్మ ఇంటి వద్దే కిరాణా దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తోంది.పల్లెలో ద్విచక్ర వాహనాలుండడంతో దుకాణంలో పెట్రోల్‌ కూడా విక్రయిస్తుండేది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఒక వ్యక్తి పెట్రోల్‌ కోసం వచ్చాడు.శుక్రవారం కావడంతో సాయంత్రం దుకాణంలో దేవుడి వద్ద శారదమ్మ దీపం పెట్టింది. ఆమె కుమారుడు ఉదయ్‌ దీపం గమనించకుండా బాటిల్‌లో పెట్రోల్‌ పోస్తుండగా పొరపాటున దీపం జారి కింద పడి మంటలు చెలరేగాయి. పెట్రోల్‌ స్టాక్‌ ఉండడంతో మంటలు వేగంగా చెలరేగాయి. గమనించిన గ్రామస్తులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు.వెంటనే అగ్నిమాపకాధికారి సుబ్బరాజు సిబ్బందితో వచ్చి మంటలు అదుపు చేసేలోపే ఇంట్లో వస్తువులు,ఉదయ్‌ ద్విచక్రవాహనం కాలిపోయాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.5లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.

Updated Date - Nov 01 , 2025 | 01:59 AM