Share News

పంచాయతీల్లో పదోన్నతుల జాతర

ABN , Publish Date - Oct 12 , 2025 | 01:40 AM

గ్రామ పంచాయతీ ఉద్యోగులకు రా ష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గ్రేడ్‌ 1 పంచాయతీ కార్యదర్శులకు డిప్యూటీ ఎంపీడీవోలుగా పదోన్నతి కల్పిస్తూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ వీఆర్‌ కృష్ణతేజ మైలవరపు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

పంచాయతీల్లో పదోన్నతుల జాతర

గ్రేడ్‌ 1 కార్యదర్శులకు డిప్యూటీ ఎంపీడీవోలుగా ప్రమోషన్‌

ఇతర జిల్లాల నుంచి ఏడుగురి రాక

తిరుపతి(కలెక్టరేట్‌), అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఉద్యోగులకు రా ష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గ్రేడ్‌ 1 పంచాయతీ కార్యదర్శులకు డిప్యూటీ ఎంపీడీవోలుగా పదోన్నతి కల్పిస్తూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ వీఆర్‌ కృష్ణతేజ మైలవరపు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా గాజులమండ్యంలో పనిచేస్తున్న గిరిధర్‌, ఆర్సీపురం మండలం పీవీపురంలో పనిచేస్తున్న షణ్ముగంకు, నారాయణవనంలో పనిచేస్తున్న సీపీ షణ్ముగంకు డిప్యూటీ ఎంపీడీవోలు(ఈవోపీఆర్డీ)గా పదోన్నతి లభించింది. అలాగే బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి ఏడుగురు డిప్యూటీ ఎంపీడీవోలను తిరుపతి జిల్లాకు కేటాయించారు. త్వరలో వీరిని ఖాళీగా ఉన్న మండలాలకు కేటాయించనున్నట్లు డీపీవో సుశీలాదేవి తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 14 డిప్యూటీ ఎంపీడీవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒకేసారి పది పోస్టులు భర్తీ కానున్నాయి.

Updated Date - Oct 12 , 2025 | 01:40 AM