Share News

శ్రీజ డెయిరీకి ప్రధాని శంకుస్థాపన

ABN , Publish Date - Oct 12 , 2025 | 01:50 AM

కుప్పంలో శ్రీజ మహిళా పాల ఉత్పత్తిదారుల సంస్థ రూ.219 కోట్లతో ఏర్పాటు చేయనున్న సమగ్ర డెయిరీ, పశు మేత తయారీ యూనిట్‌కు శనివారం ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

శ్రీజ డెయిరీకి ప్రధాని శంకుస్థాపన
కడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన వర్చువల్‌ తెరపై ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు

కుప్పం, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): కుప్పంలో శ్రీజ మహిళా పాల ఉత్పత్తిదారుల సంస్థ రూ.219 కోట్లతో ఏర్పాటు చేయనున్న సమగ్ర డెయిరీ, పశు మేత తయారీ యూనిట్‌కు శనివారం ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. దేశంలోని పలు రాష్ట్రాలలో కొత్త డెయిరీ ప్రాక్టుల ప్రారంభంలో భాగంగా ఈ వర్చువల్‌ శంకుస్థాపన జరిగింది. కుప్పం ఏరియా డెవల్‌పమెంట్‌ అథారిటీ (కడా) కార్యాలయంలో ఏర్పాటు చేసిన వర్చువల్‌ స్ర్కీన్‌లో ఈ కార్యక్రమాన్ని పలువురు ప్రముఖులు వీక్షించారు. జాతీయ పాల అభివృద్ధి కార్యక్రమం (నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ డెయిరీ డెవల్‌పమెంట్‌) పథకం తో కుప్పంలో స్థాపించనున్న ఈ డెయిరీ, పశువుల మేత యూనిట్‌ల స్థాపనతో గ్రామీణ పాల ఉత్పత్తి వ్యవస్థలకు ఆధునిక సాంకేతిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ పీఎ్‌స.మునిరత్నం, పీకేఎం ఉడా చైర్మన్‌ డాక్టర్‌ బీఆర్‌.సురేశ్‌బాబు, కడా పీడీ వికాస్‌ మర్మత్‌, రెస్కో చైర్మన్‌ వీజీ.ప్రతాప్‌, కడా రాజకీయ సలహామండలి సభ్యులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Oct 12 , 2025 | 01:50 AM