నేడు తిరుమలకు రాష్ట్రపతి రాక
ABN , Publish Date - Nov 20 , 2025 | 01:45 AM
శ్రీవారి దర్శనార్థం రాష్ట్రపతి ద్రౌపదిముర్ము గురువారం తిరుమల రానున్నారు. రేణిగుంట విమానాశ్రయం వద్ద ఆమెకు స్వాగతం పలికేందుకు గవర్నర్ రావాల్సి ఉన్నా.. చివర్లో ఆయన రద్దయింది. దీంతో హోంమంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్ వెంకటేశ్వర్ తదితరులు.. పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ అధికారులు స్వాగతం పలకనున్నారు. ఒడిశా నుంచి రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో గురువారం సాయంత్రం 4గంటలకు రేణిగుంటకు చేరుకుంటారు. రోడ్డు మార్గాన 4.30గంటలకు తిరుచానూరుకు వచ్చి పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. 5.20 గంటలకు బయలుదేరి తిరుమలకు వెళ్లి పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. శుక్రవారం ఉదయం 9.20గంటలకు వరాహస్వామిని. ఆ తర్వాత శ్రీవారి ఆలయానికి చేరుకుని మూలమూర్తిని దర్శించుకుంటారు. 11 గంటలకు తిరుగు ప్రయాణమవుతారు. మధ్యాహ్నం 12.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాదుకు బయలుదేరతారు.
గవర్నర్ పర్యటన రద్దు
స్వాగతం పలకనున్న మంత్రులు
తిరుమల, తిరుపతి(కలెక్టరేట్/నేరవిభాగం), నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి దర్శనార్థం రాష్ట్రపతి ద్రౌపదిముర్ము గురువారం తిరుమల రానున్నారు. రేణిగుంట విమానాశ్రయం వద్ద ఆమెకు స్వాగతం పలికేందుకు గవర్నర్ రావాల్సి ఉన్నా.. చివర్లో ఆయన రద్దయింది. దీంతో హోంమంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్ వెంకటేశ్వర్ తదితరులు.. పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ అధికారులు స్వాగతం పలకనున్నారు. ఒడిశా నుంచి రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో గురువారం సాయంత్రం 4గంటలకు రేణిగుంటకు చేరుకుంటారు. రోడ్డు మార్గాన 4.30గంటలకు తిరుచానూరుకు వచ్చి పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. 5.20 గంటలకు బయలుదేరి తిరుమలకు వెళ్లి పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. శుక్రవారం ఉదయం 9.20గంటలకు వరాహస్వామిని. ఆ తర్వాత శ్రీవారి ఆలయానికి చేరుకుని మూలమూర్తిని దర్శించుకుంటారు. 11 గంటలకు తిరుగు ప్రయాణమవుతారు. మధ్యాహ్నం 12.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాదుకు బయలుదేరతారు.
భారీ భద్రత: విజయవాడలోని ఓ ఇంట్లో మావోయిస్టులను అదుపులోకి తీసుకోవడం వంటి ఘటనలతో రాష్ట్రపతి పర్యటనకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. డీఐజీ షిమోషీ నేతృత్వంలో ఎస్పీ సుబ్బరాయుడు, ఐదుగురు అదనపు ఎస్పీలు, 9 మంది డీఎస్పీలు, 50 మంది సీఐలు, 100 మంది ఎస్‌ఐలు, 300 మంది పోలీసులు, రోడ్డు ఓపనింగ్ పార్టీలు, రోప్ పార్టీలు, బాంబు, డాగ్ స్క్వాడ్‌లు, పారా మిలటరీ దళాలు, రిజర్వు బలగాలు, ఏరియా డామినేషన్ పార్టీలను బందోబస్తు నిమిత్తం నియమించారు. వీరు కాకుండా రాష్ట్రపతి వెంట కమెండో దళాలు ఉంటాయి. కేంద్ర బలగాలూ మొహరించనున్నాయి. ఎయిర్‌పోర్టు నుంచి తిరుమల వరకు పటిష్ఠ బందోబస్తుతో పాటు బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. బుధవారం కూడా కాన్వాయ్ ట్రయల్‌రన్ నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్వీ మురళీకృష్ణ భద్రతా ఏర్పాట్లపై ఆలయం వద్ద చర్చించారు.