Share News

పిల్లలకు పుస్తకాలు సిద్ధం

ABN , Publish Date - Jun 11 , 2025 | 01:13 AM

సెలవుల్లో హాయిగా ఆడుతూ పాడుతూ గడిపిన చిన్నారులు రేపట్నుంచీ బడిబాట పట్టనున్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రాష్ట్రప్రభుత్వం ‘సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర’ పేరుతో స్టూడెంట్‌ కిట్స్‌ ఉచితంగా అందజేయనుంది.జిల్లాకు చేరిన పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, వర్క్‌బుక్స్‌, బ్యాగులు, తదితర సామగ్రిని విద్యార్థులకు అందించేందుకు విద్యాశాఖ, సమగ్రశిక్ష అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.ఎంఈవోల ద్వారా మండల కేంద్రాల నుంచి పాఠశాలలకు తరలించి పంపిణీకి సిద్ధం చేశారు.

పిల్లలకు పుస్తకాలు సిద్ధం
: బంగారుపాళ్యంలో స్టాక్‌ పాయింట్లకు చేరిన పాఠ్యపుస్తకాలు

- రేపే పాఠశాలల పునఃప్రారంభం

చిత్తూరు సెంట్రల్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి) : సెలవుల్లో హాయిగా ఆడుతూ పాడుతూ గడిపిన చిన్నారులు రేపట్నుంచీ బడిబాట పట్టనున్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రాష్ట్రప్రభుత్వం ‘సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర’ పేరుతో స్టూడెంట్‌ కిట్స్‌ ఉచితంగా అందజేయనుంది.జిల్లాకు చేరిన పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, వర్క్‌బుక్స్‌, బ్యాగులు, తదితర సామగ్రిని విద్యార్థులకు అందించేందుకు విద్యాశాఖ, సమగ్రశిక్ష అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.ఎంఈవోల ద్వారా మండల కేంద్రాల నుంచి పాఠశాలలకు తరలించి పంపిణీకి సిద్ధం చేశారు.

బార్‌ కోడ్‌తో పంపిణీ

విద్యార్థులకు ఇచ్చే కిట్లు, ఇతర వస్తువులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా బార్‌ కోడ్‌ సిస్టమ్‌ అమలు చేస్తోంది. షూలు, బెల్టులు, బ్యాగులకు బార్‌ కోడ్‌లు ఉన్నాయి. విద్యార్థి శారీరక దృఢత్వానికి అనుగుణంగా బ్యాగులను మూడు రకాలుగా విభజించి, మూడు రంగుల్లో ఇవ్వనున్నారు. ఒకటి, రెండు తరగతులకు(స్మాల్‌ బ్యాగ్‌) ప్యారెట్‌ గ్రీన్‌, మూడు నుంచి ఐదు తరగతులకు(మీడియం బ్యాగ్‌) పింక్‌, ఆరు నుంచి టెన్త్‌ వరకు (లార్జ్‌ బ్యాగ్‌) పచ్చరంగు బ్యాగులు ఇవ్వనున్నారు.ఒకటి నుంచి టెన్త్‌ వరకు ప్రతి విద్యార్థికీ మూడు జతల యూనిఫాం, ఒకటి నుంచి 5వ తరగతి విద్యార్థినులకు బెల్టు, ఒకటి నుంచి టెన్త్‌ వరకు విద్యార్థులకు బెల్టు, ఆరు నుంచి టెన్త్‌ వరకు నోట్‌పుస్తకాలు, ఒకటి నుంచి టెన్త్‌ వరకు పాఠ్యపుస్తకాలు, ఒకటి నుంచి ఐదవ తరగతి విద్యార్థులకు వర్క్‌బుక్స్‌, ఒకటి నుంచి టెన్త్‌ వరకు విద్యార్థులకు స్కూల్‌ బ్యాగులు ఇవ్వనున్నారు.

-----------------------------------------------------------------------------------------------------

పాఠశాల కేటగిరీ పాఠశాలల సంఖ్య విద్యార్థుల సంఖ్య

----------------------------------------------------------------------------------------------------

ప్రాథమిక 1949 52,469

ప్రాథమికోన్నత 158 10,293

ఉన్నత 355 85,668

---------------------------------------------------------------------------------------------------

మొత్తం 2462 1,48,430

----------------------------------------------------------------------------------------------------

ఫ విద్యార్థులకు అందించే కిట్‌ వివరాలు

-----------------------------------------------------------------------------------------------------

కిట్‌లోని వస్తువులు అవసరం వచ్చినవి రావాల్సినవి

-----------------------------------------------------------------------------------------------------

పాఠ్యపుస్తకాలు-వర్క్‌బుక్స్‌ 15,87,618 15,71,868 15,750

నోట్‌బుక్స్‌ 8,36,872 8,36,872 -

బ్యాగులు 1,44,400 1,26,604 17,796

యూనిఫాం 1,44,400 67,800 76,600

షూస్‌ 1,44,189 - 1,44,189

బెల్టులు 1,03,563 1,03,563 -

ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ(6వ తరగతి) 12,771 12,771 -

ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ(1వ తరగతి) 24,728 24,728 -

-----------------------------------------------------------------------------------------------------

తొలి రోజే పాఠ్యపుస్తకాలు అందజేస్తాం

31 స్టాక్‌ పాయింట్ల నుంచి జిల్లాలోని ప్రతి పాఠశాలకూ పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, కిట్లు పంపిణీ చేశాం. పాఠశాలల పునఃప్రారంభం రోజే సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర కింద పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు క్యూఆర్‌ కోడ్‌ ద్వారా అందించనున్నాం. రావాల్సినవి రెండు రోజుల్లో జిల్లాకు చేరుకుంటాయి. వీటితో పాటు మూడు జతల యూనిఫాం అందించనున్నాం.

- వెంకటరమణ, ఏపీసీ, సమగ్రశిక్ష (10సీటీఆర్‌ జేకేఆర్‌2)

Updated Date - Jun 11 , 2025 | 01:13 AM