Share News

పాలిసెట్‌ టాపర్‌ లక్ష్మీప్రశాంతి

ABN , Publish Date - May 15 , 2025 | 02:00 AM

సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు బుధవారం పాలిసెట్‌-2025 ఫలితాలు విడుదల చేసింది. 120 మార్కులకు గాను 117 మార్కులు సాధించి 267వ ర్యాంకుతో జి.లక్ష్మీప్రశాంతి జిల్లా టాపర్‌గా నిలిచింది.

పాలిసెట్‌ టాపర్‌ లక్ష్మీప్రశాంతి

చిత్తూరు సెంట్రల్‌, మే 14(ఆంధ్రజ్యోతి): సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు బుధవారం పాలిసెట్‌-2025 ఫలితాలు విడుదల చేసింది. 120 మార్కులకు గాను 117 మార్కులు సాధించి 267వ ర్యాంకుతో జి.లక్ష్మీప్రశాంతి జిల్లా టాపర్‌గా నిలిచింది. 112 మార్కులతో యు. సాయిప్రసన్న 1017 ర్యాంకు సాధించి ద్వితీయ, 111 మార్కులతో ఎస్‌.మితున్‌కృతిక్‌ 1310 ర్యాంకుతో తృతీయ స్థానంలో నిలిచారు. జిల్లా వ్యాప్తంగా 1808 మంది అభ్యర్థులు పరీక్షలు రాయగా 1718 మంది ఉత్తీర్ణత (95.02శాతం) సాధించారు. 1022 మంది విద్యార్థుల్లో 954 మంది ఉత్తీర్ణత (93.35 శాతం) సాధించగా, 786 మంది విద్యార్థినుల్లో 764 మంది ఉత్తీర్ణత (97.2 శాతం) సాధించారు.

Updated Date - May 15 , 2025 | 02:01 AM