Share News

పాలిసెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం

ABN , Publish Date - Jun 22 , 2025 | 01:57 AM

పాలిటెక్నిక్‌ డిప్లొమా ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకుగాను నిర్వహించే పాలిసెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ శనివారం ప్రారంభమైంది.

పాలిసెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం
ఎస్వీ పాలిటెక్నిక్‌లో కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థులు

143 మంది విద్యార్థుల హాజరు

నేడు 15,001 నుంచి 32,000 ర్యాంకు వరకు..

తిరుపతి(విద్య), జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్‌ డిప్లొమా ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకుగాను నిర్వహించే పాలిసెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ శనివారం ప్రారంభమైంది. తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌తోపాటు సత్యవేడు, గూడూరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల్లో కౌన్సెలింగ్‌ జరిగింది. మొదటి రోజు 1నుంచి 15,000వ ర్యాంకు వరకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 107 మంది విద్యార్థులు హాజరయ్యారు. సత్యవేడులో ఆరుగురు, గూడూరులో 30 మంది మొత్తం 143 మంది విద్యార్థులు మొదటి రోజు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. రెండో రోజు ఆదివారం 15,001 నుంచి 32,000 ర్యాంకుల వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈనెల 28వ తేదీ వరకు కౌన్సెలింగ్‌ జరగనుంది.

Updated Date - Jun 22 , 2025 | 01:57 AM