Share News

పోలెండ్‌ అమ్మాయి.. శేషాపురం అబ్బాయి

ABN , Publish Date - Oct 12 , 2025 | 11:57 PM

చంద్రగిరి మండలానికి చెందిన యువకుడు, పోలెండ్‌ దేశానికి చెందిన ఓ అమ్మాయి. వీరిద్దరూ ప్రేమించుకుని ఒక్కటయ్యారు

పోలెండ్‌ అమ్మాయి.. శేషాపురం అబ్బాయి

చంద్రగిరి, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): ప్రేమకు ఎల్లలు ఉండవని నిరూపించారు చంద్రగిరి మండలానికి చెందిన యువకుడు, పోలెండ్‌ దేశానికి చెందిన ఓ అమ్మాయి. వీరిద్దరూ ప్రేమించుకుని ఒక్కటయ్యారు. చంద్రగిరి మండలం శేషాపురం గ్రామానికి చెందిన కనుమూరి మురళీధర్‌ నాయుడు, దేవకి దంపతుల కుమారుడు దేవ శివసాయి మురారీ జర్మనీలోని ఓ మెడికల్‌ కంపెనీలో ఆరేళ్లుగా పనిచేస్తున్నాడు. అదే సంస్థలో పనిచేస్తున్న పోలెండ్‌ దేశానికి చెందిన యావ్‌గోర్జాత్‌ని ప్రేమించాడు. తమ ప్రేమ విషయాన్ని వీరిద్దరూ తల్లిదండ్రులకు వివరించారు. వారు సరే అన్నారు. కాశిపెంట్ల వద్ద ఏజేపీ రిసార్ట్స్‌లో శనివారం రాత్రి వీరి వివాహం జరిగింది.

Updated Date - Oct 12 , 2025 | 11:57 PM