2,46,974 మందికి పోలియో చుక్కలు
ABN , Publish Date - Dec 22 , 2025 | 02:11 AM
పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 2,011 కేంద్రాల పరిధిలో 2,46,974 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసి తొలిరోజు 95 శాతం లక్ష్యాన్ని పూర్తి చేశామని డీఎంహెచ్‌వో బాలకృష్ణనాయక్ అన్నారు.
తొలిరోజు 95 శాతం పూర్తి
తిరుపతి(వైద్యం), డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 2,011 కేంద్రాల పరిధిలో 2,46,974 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసి తొలిరోజు 95 శాతం లక్ష్యాన్ని పూర్తి చేశామని డీఎంహెచ్‌వో బాలకృష్ణనాయక్ అన్నారు. స్థానిక ఎంఆర్‌పల్లిలోని యూపీహెచ్‌సీలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుతో కలిసి డీఎంహెచ్‌వో బాలకృష్ణనాయక్ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తొలిరోజు కార్యక్రమం విజయవంతమైందని, మిగిలిన చిన్నారులకు 22, 23 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి వేసేందుకు 3,736 బృందాలను ఏర్పాటు చేశామన్నారు.