Share News

పోలీసు జాగిలం మృతి

ABN , Publish Date - Aug 05 , 2025 | 02:04 AM

ఎన్నో బంగారు పతకాలు సాధించింది. వీఐపీల భద్రతలో సమర్థంగా వ్యవహరించింది. పోలీసు శాఖకు విశిష్ట సేవలు అందించింది. అలాంటి పోలీసు జాగిలం పృథ్వీ.. వయోభారంతో సోమవారం మృతిచెందింది.

పోలీసు జాగిలం మృతి
జాగిలానికి నివాళులు అర్పిస్తున్న అదనపు ఎస్పీ

తిరుపతి(నేరవిభాగం)ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): ఎన్నో బంగారు పతకాలు సాధించింది. వీఐపీల భద్రతలో సమర్థంగా వ్యవహరించింది. పోలీసు శాఖకు విశిష్ట సేవలు అందించింది. అలాంటి పోలీసు జాగిలం పృథ్వీ.. వయోభారంతో సోమవారం మృతిచెందింది. ఎనిమిది సంవత్సరాల పాటు పోలీసు శాఖకు సేవలు అందించి 2023లో పదవీ విరమణ పొందింది. రిజర్వు అదనపు ఎస్పీ శ్రీనివాసరావు జిల్లా డాగ్‌ కెనాల్‌ వద్ద పృథ్వీ కళేబరంపై పుషక్పగుచ్చం ఉంచి గౌరవ వందనం సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సంధర్బంగా జిల్లా పోలీసు శాఖకు జాగిలం అందించిన సేవలు చిరస్మరణీయమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో రిజర్వు డీఎస్పీలు, సీఐలు, సీవీఎ్‌సవో మోహన్‌ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. లాబ్రడార్‌ రిట్రైవర్‌ జాతికి చెందిన పృథ్వీ హ్యాండ్లర్‌ మోహన్‌ నేతృత్వంలో పలువురు వీవీఐపీల బందోబస్తు సందర్భంగాను.. తిరుమల బ్రహ్మోత్సవాల సమయాల్లోనూ భద్రతా తనిఖీల్లో పాల్గొంది. బేసిక్‌ శిక్షణలో 2014లో గోల్డు మెడల్‌ సాధించింది. లక్నోలో జరిగిన ఆల్‌ ఇండియా ఇండియా డ్యూటీ మీట్‌లో 2019లో పాల్గొనింది. 2020లో జరిగిన ఏపీ పోలీసు డ్యూటీ మీట్‌లో గోల్డు మెడల్‌ సాధించింది.

Updated Date - Aug 05 , 2025 | 02:04 AM