లాడ్జీలపై పోలీసుల మెరుపు దాడులు
ABN , Publish Date - Oct 10 , 2025 | 12:21 AM
చిత్తూరు నగరంలోని పలు లాడ్జీలపై బుధవారం రాత్రి పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. వివరాలను గురువారం ఒకటో పట్టణ సీఐ మహేశ్వర తెలియజేశారు. నగరంలోని వినాయక లాడ్జిపై దాడి చేసి.. నిర్వాహకుడు వెంకటేష్, రూమ్ బాయ్ రవితోపాటు ముగ్గురు మహిళలను, విటుడు అజీమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే గణేష్ లాడ్జిపై దాడి చేసి.. మేనేజర్ ఉమాపతి, రూమ్ బాయ్ సురేంద్రబాబుతో పాటు రూముల్లోని ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. మాధవ అనే వ్యక్తి పారిపోయాడు. విచారించగా.. మహిళలంతా హైదరాబాదు, శ్రీకాకుళం, నెల్లూరు, విజయవాడ నుంచి కూలి పనుల కోసం ఇక్కడికి వచ్చినట్లు గుర్తించారు. వీరికి డబ్బు ఆశ చూపి వ్యభిచారం చేయిస్తున్నట్లు తేలడంతో వెంకటేష్, రవి, ఉమాపతి, సురేంద్రబాబు, విటుడు అజీమ్‌లపై కేసు నమోదు చేసి గురువారం రాత్రి కోర్టులో హాజరు పరిచారు. నిందితులకు నాల్గవ అదనపు కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది.
- ఐదుగురిపై కేసు నమోదు
- 14రోజుల రిమాండ్ విధించిన కోర్టు
చిత్తూరు అర్బన్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు నగరంలోని పలు లాడ్జీలపై బుధవారం రాత్రి పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. వివరాలను గురువారం ఒకటో పట్టణ సీఐ మహేశ్వర తెలియజేశారు. నగరంలోని వినాయక లాడ్జిపై దాడి చేసి.. నిర్వాహకుడు వెంకటేష్, రూమ్ బాయ్ రవితోపాటు ముగ్గురు మహిళలను, విటుడు అజీమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే గణేష్ లాడ్జిపై దాడి చేసి.. మేనేజర్ ఉమాపతి, రూమ్ బాయ్ సురేంద్రబాబుతో పాటు రూముల్లోని ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. మాధవ అనే వ్యక్తి పారిపోయాడు. విచారించగా.. మహిళలంతా హైదరాబాదు, శ్రీకాకుళం, నెల్లూరు, విజయవాడ నుంచి కూలి పనుల కోసం ఇక్కడికి వచ్చినట్లు గుర్తించారు. వీరికి డబ్బు ఆశ చూపి వ్యభిచారం చేయిస్తున్నట్లు తేలడంతో వెంకటేష్, రవి, ఉమాపతి, సురేంద్రబాబు, విటుడు అజీమ్‌లపై కేసు నమోదు చేసి గురువారం రాత్రి కోర్టులో హాజరు పరిచారు. నిందితులకు నాల్గవ అదనపు కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది.