Share News

తిరుపతిలో పోలీస్‌ బాస్‌లు

ABN , Publish Date - Aug 30 , 2025 | 01:18 AM

దక్షిణాదిలోని మూడు రాష్ట్రాల డీజీపీలు. ఐదు రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఉన్నతస్థాయి పోలీసు అధికారులు. ఇలా 48 మంది ఉన్నతాధికారులతోపాటు బీఎ్‌సఎఫ్‌, సీఆర్‌ఫీఎఫ్‌, సీఐఎ్‌సఎఫ్‌, సీబీఐ, ఎన్‌ఐఏ, ఎన్‌సీబీ అధికారులు తిరుపతిలో సమావేశమయ్యారు.

తిరుపతిలో పోలీస్‌ బాస్‌లు
సమావేశానికి వస్తున్న డీజీపీ హరీ్‌షకుమార్‌ గుప్తా తదితరులు

సమన్వయ కమిటీ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల ఉన్నతాధికారుల రాక

తిరుపతి(నేరవిభాగం), ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): దక్షిణాదిలోని మూడు రాష్ట్రాల డీజీపీలు. ఐదు రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఉన్నతస్థాయి పోలీసు అధికారులు. ఇలా 48 మంది ఉన్నతాధికారులతోపాటు బీఎ్‌సఎఫ్‌, సీఆర్‌ఫీఎఫ్‌, సీఐఎ్‌సఎఫ్‌, సీబీఐ, ఎన్‌ఐఏ, ఎన్‌సీబీ అధికారులు తిరుపతిలో సమావేశమయ్యారు. ఆయా రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, సమన్వయం, అక్రమ రవాణా, అంతర్రాష్ట్ర దొంగలను కట్టడి చేయడం, సైబర్‌ నేరాలు, మహిళా ట్రాఫికింగ్‌, సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే అంశాలపై నిఘా ఉంచడం, డ్రగ్స్‌ ముఠా ఆట కట్టించడం, సమాచార మార్పిడి తదితర విషయాలపై దాదాపు ఎనిమిది గంటల పాటు చర్చించారు. తమకు ఎదురైన సవాళ్లను ఎదుర్కొనడానికి అన్ని రాష్ట్రాలు కలిసి తీసుకోవాల్సిన చర్యలను ఏపీ డీజీపీ హరీ్‌షకుమార్‌ గుప్తా వివరించారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇంతమంది పోలీసు ఉన్నతాధికారులు రావడంతో గ్రాండ్‌ రిడ్జ్‌ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. తనిఖీలు ముమ్మరం చేశారు. వాహనాలను దారి మళ్లించారు. కొందరు పోలీసు అధికారులు గురువారం రాత్రే తిరుపతికి చేరుకున్నారు. వీరిలో కొందరు తిరుమల వెళ్లి శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని సమావేశానికి వచ్చారు. మరికొందరు శనివారం శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ సమావేశానికి హాజరైన వారి కోసం ఎస్పీ హర్షవర్ధనరాజు ఆధ్వర్యంలో అధికారులు బస, భోజనం, సమావేశ ఏర్పాట్లు పక్కాగా చేశారు. ఈ సమావేశంలో ఏపీ డీజీపీతో పాటు కేరళ డీజీపీ రావాడ చంద్రశేఖర్‌, పుదుచ్చేరి డీజీపీ శాలిని సింగ్‌, ఎనిమిది మంది అదనపు డీజీలు, 9 మంది ఐజీలు, 12 మంది డీఐజీలు, 16 మంది ఎస్పీలు, కేంద్ర భద్రత బలగాల వింగ్‌ల నుంచీ అధికారులు హాజరయ్యారు.

Updated Date - Aug 30 , 2025 | 01:18 AM