పోలీసుల ప్రవర్తన ఆదర్శనీయంగా ఉండాలి
ABN , Publish Date - Jul 23 , 2025 | 12:30 AM
పోలీసుల ప్రవర్తన ఆదర్శనీయంగా ఉండాలని ఎస్పీ మణికంఠ సూచించారు.
చిత్తూరు అర్బన్, జూలై 22 (ఆంధ్రజ్యోతి): పోలీసుల ప్రవర్తన ఆదర్శనీయంగా ఉండాలని ఎస్పీ మణికంఠ సూచించారు. మంగళవారం స్థానిక జడ్పీ సమావేశపు హాలులో జిల్లా పోలీసులు, ఇతర శాఖల అధికారులతో అర్ధ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విజిబుల్ పోలీసింగ్ పెంచాలని చెప్పారు. మెడికో- లీగల్‌సెల్ కేసుల్లో వైద్య ఆరోగ్యశాఖ సహకారం, పోస్టుమార్టం నివేదికల విషయంలో నిపుణుల అభిప్రాయాలతోపాటు రోడ్లు, ఐటీ విభాగం, విద్యుత్‌శాఖల అధికారుల సమాచారం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రోడ్డు ప్రమాదాల తగ్గింపు, మాదక ద్రవ్యాల నిరోధం, దొంగతనాలు, గ్రేవ్‌కేసులు, పోక్సో కేసులపై సమీక్షించారు. అసాంఘిక కార్యక్రమాల నివారణకు డ్రోన్ల వినియోగాన్ని పెంచాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. యాప్ ద్వారా లోన్ ఇస్తామని చెప్పేవారి మాటలను నమ్మొద్దని సూచించారు. ఎవరైనా మోసపోతే 1930 నెంబరుకు కాల్ చేయాలన్నారు. సమావేశంలో కలెక్టర్ సుమిత్‌కుమార్, జేసీ విద్యాధరి, డీఎ్‌ఫవో భరణి, డీఆర్వో మోహన్‌కుమార్, రైల్వే డీఎస్పీ హర్షిత, ఆర్టీవో రంజిత్‌కుమార్, డీఈవో వరలక్ష్మి, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.