Share News

పోలీసులే తోబుట్టువులై..!

ABN , Publish Date - Jun 05 , 2025 | 01:22 AM

ఆమెకు అన్నదమ్ముల్లేరు. ఆ లోటును భర్తీ చేస్తూ సహచర కానిస్టేబుళ్లే తోబుట్టువులయ్యారు. పోలీసు స్టేషన్‌లో ఆమెకు శ్రీమంతం చేశారు. తమలోని మానవతను చాటారు. ఈ ఘటన బుధవారం తడ పోలీసు స్టేషనులో జరిగింది.

పోలీసులే తోబుట్టువులై..!

మహిళా కానిస్టేబుల్‌కు శ్రీమంతం చేసిన సహచర సిబ్బంది

తడ, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఆమెకు అన్నదమ్ముల్లేరు. ఆ లోటును భర్తీ చేస్తూ సహచర కానిస్టేబుళ్లే తోబుట్టువులయ్యారు. పోలీసు స్టేషన్‌లో ఆమెకు శ్రీమంతం చేశారు. తమలోని మానవతను చాటారు. ఈ ఘటన బుధవారం తడ పోలీసు స్టేషనులో జరిగింది. తడలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న టి.ప్రమీల స్వగ్రామం నెల్లూరుజిల్లా మనుబోలు. సూళ్లూరుపేట అత్తగారి ఇల్లు. తల్లిదండ్రులు తప్ప అన్నదమ్ముల్లేరు. పెళ్లయిన పదేళ్ల తర్వాత ఆమె తొలిసారి గర్భవతి అయ్యారు. ఇటీవలే 9 నెలలు నిండి కాన్పుకు వెళ్లేందుకు ప్రసూతి సెలవు పెట్టుకున్నారు. మహిళా కానిస్టేబుల్‌ అయిన ఆమె కూడా ఆడబిడ్డే. తోడపుట్టిన అన్నదమ్ములు లేరని, శ్రీమంతం చేసుకోవాలని ఉన్నా ఆ యోగం తనకు లేదంటూ మనస్సులోనే బాధ పడేవారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఐ కొండపనాయుడు, సిబ్బంది ఆ ఆడపడుచుకు సోదరులయ్యారు. బుధవారం సాయంత్రం పోలీసు స్టేషన్‌లోనే ఆమెకు శ్రీమంతం జరిపించారు. దీంతో ప్రమీల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. సొంత అన్నదమ్ముల్లా శ్రీమంతం జరిపిన తోటి సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jun 05 , 2025 | 01:22 AM