Share News

మేలుకో మహాశయా

ABN , Publish Date - Oct 09 , 2025 | 01:24 AM

అలా కుర్చీలో కునుకు తీశారా అధికారి. ఆయన్ను నిద్రలేపే సాహసం చేయలేకపోయారు సిబ్బంది. ఆయన తో పనుండి వచ్చిన వారూ ఎదురుగా కుర్చీల్లో కూర్చున్నారు. సార్‌.. ఎప్పుడు నిద్రలేస్తారోనని నిరీక్షిస్తున్నారు.

మేలుకో మహాశయా

అలా కుర్చీలో కునుకు తీశారా అధికారి. ఆయన్ను నిద్రలేపే సాహసం చేయలేకపోయారు సిబ్బంది. ఆయన తో పనుండి వచ్చిన వారూ ఎదురుగా కుర్చీల్లో కూర్చున్నారు. సార్‌.. ఎప్పుడు నిద్రలేస్తారోనని నిరీక్షిస్తున్నారు. ఇదీ నిత్యం రద్దీగా ఉండే రేణిగుంట సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో బుధవారం నాటి చిత్రం. ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ర్టారు ఆనంద్‌రెడ్డి ఇలా కునుకుతీస్తూ కనిపించారు. ఆయన సంతకం కోసం పలువురు వేచి ఉన్నారు. ఇక్కడ రద్దీలో ఏ పని జరగాలన్నా కొంత ఆలస్యం సహజం. కానీ ఇలా ఇన్‌చార్జి సబ్‌రిజిస్ర్టారు వ్యవహారంతో సిబ్బందీ ఉదాసీనంగా ఉంటున్నారు.

- రేణిగుంట, ఆంధ్రజ్యోతి

Updated Date - Oct 09 , 2025 | 01:24 AM