Share News

నచ్చిన ఆట ఆడండి

ABN , Publish Date - Aug 30 , 2025 | 01:17 AM

‘ఆధునిక క్రీడలతో పాటు ప్రాచీన భారతీయ ఆటల్లో మీకు నచ్చినవి ఆడండి. దీనివల్ల మానసిక ఉల్లాసం కలుగుతుంది. మేధస్సు చురుగ్గా ఉంటుంది. చదువులో చురుగ్గా రాణిస్తారు’ అంటూ పలువురు పిలుపునిచ్చారు.

నచ్చిన ఆట ఆడండి
ధ్యాన్‌చంద్‌ విగ్రహం వద్ద అధికారులు, హాకీ క్రీడాకారులు

‘ఆధునిక క్రీడలతో పాటు ప్రాచీన భారతీయ ఆటల్లో మీకు నచ్చినవి ఆడండి. దీనివల్ల మానసిక ఉల్లాసం కలుగుతుంది. మేధస్సు చురుగ్గా ఉంటుంది. చదువులో చురుగ్గా రాణిస్తారు’ అంటూ పలువురు పిలుపునిచ్చారు. ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శశిధర్‌ ఆధ్వర్యంలో తిరుపతి శ్రీనివాస క్రీడా సముదాయంలోని ఆయన విగ్రహానికి గజమాల వేశారు. క్రీడాకారులు హాకీ స్టిక్స్‌ను ప్రదర్శిస్తూ నివాళులర్పించారు. రాష్ట్రస్థాయి క్రీడల్లో రాణించిన వారికి డీఎ్‌సడీవో, సెట్విన్‌ సీఈవో మోహన్‌కుమార్‌ జ్ఞాపికలను ప్రదానం చేశారు. ఒలంపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షకార్యదర్శులు వై.ప్రవీణ్‌, ఆర్‌.శ్రీధర్‌, ప్రతినిధులు సాయికుమార్‌, విజయ్‌కుమార్‌, శివప్రసాద్‌, శాప్‌ కోచ్‌లు గోపి, వినోద్‌, హిందుజ, సాయిసుమతి, ఆది, హరి, పేరమ్‌నాథ్‌, తైక్వాండో, ఫుట్‌బాల్‌, బాక్సింగ్‌ అసోసియేషన్ల తరపున గోపీనాయుడు, రెడ్డెప్ప, కైలాష్‌ పాల్గొని ధ్యాన్‌చంద్‌ సేవలను స్మరించుకున్నారు. ఎస్వీయూ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ ఎం.శివశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో హాకీ క్రీడాకారులు జాతీయ జెండాను ప్రదర్శించారు.

- తిరుపతి(క్రీడలు), ఆంధ్రజ్యోతి

Updated Date - Aug 30 , 2025 | 01:17 AM