Share News

95.89 శాతం మందికి పింఛన్ల పంపిణీ

ABN , Publish Date - Jul 02 , 2025 | 02:09 AM

ఎన్టీఆర్‌ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో జిల్లాకు ప్రథమ స్థానం లభించింది. 691 సచివాలయాల పరిధిలో ఉద్యోగులు ఉదయం 6.30 గంటల నుంచే పింఛన్ల పంపిణీ చేపట్టారు.

95.89 శాతం మందికి పింఛన్ల పంపిణీ
తిరుపతి రూరల్‌ ఓటేరులో పింఛను అందజేస్తున్న కలెక్టర్‌

ఎన్టీఆర్‌ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో జిల్లాకు ప్రథమ స్థానం లభించింది. 691 సచివాలయాల పరిధిలో ఉద్యోగులు ఉదయం 6.30 గంటల నుంచే పింఛన్ల పంపిణీ చేపట్టారు. తిరుపతి రూరల్‌ మండలం ఓటేరు పంచాయతీలో కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ పింఛన్లు అందజేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. జిల్లాలో 2,59,732మంది లబ్ధిదారులకుగాను రాత్రి 7గంటలకు 2,49,054మందికి పింఛన్లు అందజేసినట్లు డీఆర్‌డీఏ పీడీ శోభన్‌బాబు, ఏపీడీ ప్రభావతి తెలిపారు. రాష్ట్రంలో పింఛన్లు పంపిణీలో 95.89 శాతంతో జిల్లాలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. సంబంధిత అధికారులను కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, జేసీ శుభం బన్సల్‌ అభినందించారు.

- తిరుపతి(కలెక్టరేట్‌), ఆంధ్రజ్యోతి

Updated Date - Jul 02 , 2025 | 02:10 AM