Share News

2,43,184 మందికి పింఛన్ల పంపిణీ

ABN , Publish Date - Dec 02 , 2025 | 01:59 AM

జిల్లాలో సోమవారం ఉదయం 8 గంటలకు పింఛన్ల పంపిణీ మొదలైంది. వర్షం పడుతున్నా సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందించారు.

2,43,184 మందికి పింఛన్ల పంపిణీ
జీవకోనలో పింఛన్లు పంపిణీ చేస్తున్న మంత్రి అనగాని తదితరులు

తిరుపతి(కలెక్టరేట్‌), డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమవారం ఉదయం 8 గంటలకు పింఛన్ల పంపిణీ మొదలైంది. వర్షం పడుతున్నా సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందించారు. మొత్తం 2,62,108మందికిగాను సాయంత్రం 7 గంటలకు 2,42,935 మందికి (92.78శాతం) రూ.104.16 కోట్లను పంపిణీ చేసినట్లు డీఆర్‌డీఏ పీడీ శోభన్‌బాబు, ఏపీడీ ప్రభావతి తెలిపారు. తిరుపతి నగరం జీవకోనలో మంత్రి అనగాని సత్యప్రసాద్‌, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, పలువురు కార్పొరేటర్లు, కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఇన్‌ఛార్జి జేసీ మౌర్య తదితరులు పింఛన్లను పంపిణీ చేశారు.

Updated Date - Dec 02 , 2025 | 01:59 AM