Share News

విశ్రాంత ఉద్యోగుల పెన్షన్‌లో ఒకరికి కోత.. మరొకరికి పునరుద్ధరణ

ABN , Publish Date - Nov 04 , 2025 | 12:50 AM

ఈఎ్‌సఐ ఆస్పత్రిలో రిటైరైన డాక్టర్‌కు పెన్షన్‌లో 9 శాతం కోత పడింది. నిధుల దుర్వినియోగం ఆరోపణలపై వైద్య ఆరోగ్య శాఖ విశ్రాంత ఏవోకు గతంలో పెన్షన్‌లో విధించిన కోతను ఎత్తివేశారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

విశ్రాంత ఉద్యోగుల పెన్షన్‌లో ఒకరికి కోత.. మరొకరికి పునరుద్ధరణ

తిరుపతి(వైద్యం), నవంబరు 3(ఆంధ్రజ్యోతి): ఈఎ్‌సఐ ఆస్పత్రిలో రిటైరైన డాక్టర్‌కు పెన్షన్‌లో 9 శాతం కోత పడింది. నిధుల దుర్వినియోగం ఆరోపణలపై వైద్య ఆరోగ్య శాఖ విశ్రాంత ఏవోకు గతంలో పెన్షన్‌లో విధించిన కోతను ఎత్తివేశారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

తిరుపతిలోని ఈఎ్‌సఐ ఆస్పత్రిలో స్పెషల్‌ గ్రేడ్‌ సివిల్‌ సర్జన్‌గా రిటైరైన డాక్టర్‌ సీకే రమే్‌షకుమార్‌.. 2017లో కర్నూలు జిల్లాలోని ఈఎ్‌సఐ ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌గా పనిచేశారు. ఆ సమయంలో నర్సింగ్‌ హోమ్‌లు, ప్రవేటు ఆస్పత్రులు స్థాపించి వాటిల్లో అర్హత లేని వ్యక్తులను వైద్యులుగా నియమించి రోగులకు వైద్యం అందించారంటూ ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీనిపై ప్రభుత్వం విజిలెన్సు విచారణ చేపట్టింది. ఆ ఆరోపణలు వాస్తవాలుగా నిర్ధారించడంతో ఆయనపై అప్పట్లో క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక అందింది. దీంతో ఆయనకు అందుతున్న పింఛనులో మూడేళ్ల పాటు 9 శాతం కోత విధిస్తూ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

2015లో చిత్తూరులోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో పరిపాలన అధికారి(ఏవో)గా పనిచేస్తున్న ఎస్‌ అరుణాచలం తప్పుడు మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ను క్లైయిమ్‌ చేసి నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో అప్పట్లో విచారణ చేపట్టారు. ఈ కేసు విచాణరలో ఉండగా ఆయన 2018లో పదవీ విరమణ పొందారు. విచారణ అనంతరం ఆయనకు అందే పింఛనులో 5 శాతం శాశ్వతంగా కోత విధించాలని అప్పట్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై బాధితుడు ఎస్‌ అరుణాచలం ఏపీ అడ్మినిస్ర్టేటివ్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో బాధితుడికి ఎటువంటి కోత లేకుండా పూర్తి స్థాయిలో పింఛను అందించడంతోపాటు ఆయనకు రావాల్సిన బకాయిలను కూడా అందించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయనకు రావాల్సిన పెన్షను బకాయిలతో కలిసి నెలలోపు చెల్లించాలని సౌరభ్‌గౌర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Nov 04 , 2025 | 12:50 AM