ఆరుగురిపై పీడీ యాక్టు
ABN , Publish Date - Nov 30 , 2025 | 01:10 AM
గంజాయి, డ్రగ్స్ విక్రయాలు, వినియోగం, రవాణా చేస్తున్న ఆరుగురిపై పీడీ యాక్టు నమోదు చేశారు. ఎస్పీ సుబ్బరాయుడు శనివారం తన కార్యాలయంలో ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు.
- గంజాయి, డ్రగ్స్ సరఫరా, విక్రయాల కేసుల్లో..
- త్వరలో మరింత మందిపై ఉంటాయన్న ఎస్పీ
తిరుపతి(నేరవిభాగం), నవంబరు 29(ఆంధ్రజ్యోతి): గంజాయి, డ్రగ్స్ విక్రయాలు, వినియోగం, రవాణా చేస్తున్న ఆరుగురిపై పీడీ యాక్టు నమోదు చేశారు. ఎస్పీ సుబ్బరాయుడు శనివారం తన కార్యాలయంలో ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. జిల్లాలో శాంతిభత్రలకు విఘాతం కలిగిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. అదే సమయంలో డ్రగ్స్, గంజాయి కట్టడికి ప్రత్యేక నిఘా కొనసాగుతోందన్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఏడుగురిపై పీడీ యాక్టు నమోదు చేశామని తెలిపారు. ప్రస్తుతం మరో ఆరుగురిపై నమోదు చేశామని వివరించారు. ఇందులో శ్రీకాళహస్తి శ్రీరామనగర్ కాలనీకి చెందిన కరణి సాయికుమార్, బృందమ్మ కాలనీకి చెందిన చెరుకుర్తి వంశీ, వీఎం పల్లెకు చెందిన వేణుగోపాల్, పరందాము, తిరుపతి పద్మావతీపురానికి చెందిన సాడు హరి, తడ గ్రామానికి చెందిన నల్లూ మురళి ఉన్నారని తెలిపారు. వీరిపై మాదక ద్రవ్యాలు, గంజాయి, బాంబు ఎక్స్‌ప్లోజివ్స్, ఎర్రచందనం అక్రమ రవాణా, దొమ్మీ, హత్య కేసులు నమోదై ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీ రవిమనోహరాచారి, డీఎస్పీలు కేఎన్ మూర్తి, చెంచుబాబు, తిరుచానూరు సీఐ సునీల్‌కుమార్, తడ సీఐలు పాల్గొన్నారు.