నేడు ముసలిమడుగుకు పవన్‌కళ్యాణ్
ABN , Publish Date - Nov 09 , 2025 | 12:49 AM
ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఆదివారం ఉదయం పలమనేరు సమీపంలోని ముసలిమడుగు కుంకీ ఏనుగుల క్యాంపును సందర్శించనున్నారు.తిరుపతి నుంచి హెలికాఫ్టర్‌లో ఉదయం 10.35గంటలకు పెంగరగుంట వద్ద ఏర్పాటుచేసిన హెలిపాడ్‌కు ఆయన చేరుకుంటారు.
పలమనేరు, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి) : ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఆదివారం ఉదయం పలమనేరు సమీపంలోని ముసలిమడుగు కుంకీ ఏనుగుల క్యాంపును సందర్శించనున్నారు.తిరుపతి నుంచి హెలికాఫ్టర్‌లో ఉదయం 10.35గంటలకు పెంగరగుంట వద్ద ఏర్పాటుచేసిన హెలిపాడ్‌కు ఆయన చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డుమార్గాన కారులో ముసలిమడుగులోని కుంకీ ఏనుగుల శిక్షణ శిబిరానికి 10.50గంటలకు వస్తారు.కుంకీ ఏనుగుల శిబిరాన్ని, గజారామాన్ని, నగరవనాన్ని ప్రారంభిస్తారు.అనంతరం రైతులతో ముఖాముఖి మాట్లాడతారు.12.45గంటలకు తిరుగుప్రయాణమవుతారు.ఈ నేపథ్యంలో చేస్తున్న ఏర్పాట్లను శనివారం కలెక్టర్ సుమిత్‌కుమార్ పరిశీలించారు.జిల్లా అటవీశాఖ అధికారి సుబ్బరాజు, పలమనేరు ఆర్డీవో పి. భవాని, సబ్ డీఎఫ్‌వో వేణుగోపాల్, రేంజర్ నారాయణ ఏర్పాట్ల గురించి కలెక్టర్‌కు వివరించారు.