Share News

పహల్గాం ‘ఉగ్ర’దాడితో తిరుపతి, తిరుమలలో హైఅలర్ట్‌

ABN , Publish Date - Apr 25 , 2025 | 02:18 AM

పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో పోలీసులు, టీటీడీ విజిలెన్సు అప్రమత్తమైంది. తిరుపతి, తిరుమలలో భద్రత కట్టుదిట్టం చేశారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండు, రైల్వే స్టేషన్‌, విష్ణునివాసం, మాధవం, అన్ని ఆలయాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమానం ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు కట్టుదిట్టం చేశారు. తిరుపతిలోని అన్ని రోడ్లు, ముఖ్య కూడళ్లలో బాంబు, డాగ్‌ స్క్వాడ్లు తనిఖీలు చేస్తున్నాయి. ఇప్పటికే బాంబు నిర్వీర్యం చేసే దళాలు రంగంలోకి దిగి లాడ్జీలు, కొన్ని భవనాలు పరిశీలిస్తున్నారు. ఆలయాల వద్ద భద్రత పెంచారు. తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం నేతృత్వంలో సీఐలు, ఎస్‌ఐలు, పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇలాంటి తనిఖీలు మరో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ హర్షవర్ధనరాజు చెప్పారు. తిరుపతి, తిరుమలలో మొత్తం 75 ప్రాంతాల్లో భద్రతా బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. ఇక, అలిపిరి చెక్‌ పాయింట్‌ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.

పహల్గాం ‘ఉగ్ర’దాడితో   తిరుపతి, తిరుమలలో హైఅలర్ట్‌
తిరుపతిలో వాహనాలు తనిఖీ

- ఘాట్లలో ముమ్మరంగా కూంబింగ్‌

తిరుపతి(నేరవిభాగం), ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో పోలీసులు, టీటీడీ విజిలెన్సు అప్రమత్తమైంది. తిరుపతి, తిరుమలలో భద్రత కట్టుదిట్టం చేశారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండు, రైల్వే స్టేషన్‌, విష్ణునివాసం, మాధవం, అన్ని ఆలయాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమానం ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు కట్టుదిట్టం చేశారు. తిరుపతిలోని అన్ని రోడ్లు, ముఖ్య కూడళ్లలో బాంబు, డాగ్‌ స్క్వాడ్లు తనిఖీలు చేస్తున్నాయి. ఇప్పటికే బాంబు నిర్వీర్యం చేసే దళాలు రంగంలోకి దిగి లాడ్జీలు, కొన్ని భవనాలు పరిశీలిస్తున్నారు. ఆలయాల వద్ద భద్రత పెంచారు. తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం నేతృత్వంలో సీఐలు, ఎస్‌ఐలు, పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇలాంటి తనిఖీలు మరో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ హర్షవర్ధనరాజు చెప్పారు. తిరుపతి, తిరుమలలో మొత్తం 75 ప్రాంతాల్లో భద్రతా బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. ఇక, అలిపిరి చెక్‌ పాయింట్‌ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. రెండు ఘాట్‌ రోడ్లలో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఘాట్‌లోని లింకు రోడ్డులో ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలను తనిఖీ చేసి పంపుతున్నారు. టీటీడీ సీవీఎ్‌సవో ఎఫ్‌ఏసీ హోదాలో ఎస్పీ హర్షవర్ధనరాజు తిరుమల భద్రతపై అన్ని శాఖల అధికారులతో సమీక్షించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Updated Date - Apr 25 , 2025 | 02:18 AM