Share News

నేను చెప్పిన అభ్యర్థికే పోస్టు దక్కాలి!

ABN , Publish Date - Sep 04 , 2025 | 02:21 AM

టీటీడీ నిర్వహణలోని స్విమ్స్‌లో 9 ప్రొఫెసర్‌, 20 అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 67 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల నియామకానికి గత నెల 14న నోటిఫికేషన్‌ జారీ అయింది. ఇందులో డెంటల్‌ విభాగంలోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టు ఉంది. ఆ విభాగాన్ని డెంటిస్ట్రీ అని పేర్కొనాలి. దీనికి ఎండీఎస్‌ (మాస్టర్‌ ఆఫ్‌ డెంటల్‌ సర్జరీ)లో ఎనిమిది స్పెషాలిటీల వైద్యులందరూ దరఖాస్తు చేయడానికి అర్హులవుతారు. ఆ ప్రకారమే 2023లో నోటిఫికేషన్‌ ఇచ్చారు. మరిప్పుడు ప్రత్యేకించి ‘ఓరల్‌ మ్యాక్సిలో ఫేషియల్‌ సర్జరీ’ అన్న స్పెషాలిటీని మాత్రమే నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇలా చేయడం వెనుక తిరుపతికి చెందిన వైసీపీ ముఖ్య నేత ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ నేత సిఫార్సు చేసిన వ్యక్తికి ఈ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టు దక్కేందుకే ఇలా చేశారని అంటున్నారు. 2023 అక్టోబరు 22న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో డెంటిస్ట్రీ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టును చేర్చారు. ఆ పోస్టుకు వైసీపీ నేత తనకు కావాల్సిన అభ్యర్థిని సిఫారసు చేసినట్టు సమాచారం. అప్పట్లో వైసీపీనే అధికారంలో ఉండటంతో ఆ నేత సూచించిన అభ్యర్థికే ఆ పోస్టు దక్కుతుందని ధీమాతో ఉన్నారట. అందుకని రూ.25 లక్షలకు బేరం కుదుర్చుకుని ఆ నేత వ్యక్తిగత సహాయకుడి ద్వారా రూ.23 లక్షలు తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి.

నేను చెప్పిన అభ్యర్థికే పోస్టు దక్కాలి!
నేను చెప్పిన అభ్యర్థికే పోస్టు దక్కాలి!

  • స్విమ్స్‌ డెంటల్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు వైసీపీ నేత టార్గెట్‌

  • 2023లో తీవ్ర పోటీతో పెండింగ్‌

  • - నేటికీ స్విమ్స్‌ను వీడని వైసీపీ ప్రభావం

(తిరుపతి, ఆంధ్రజ్యోతి)

స్విమ్స్‌ అధికారులు 2023 అక్టోబరు 22న రిక్రూట్‌ మెంట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. అందులో డెంటిస్ట్రీ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు ‘డెంటిస్ట్రీ’గా పేర్కొన్నారు.

తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్‌లోనూ ఈ పోస్టును చూపారు. డిపార్టుమెంట్‌ అన్న కాలమ్‌లో డెంటిస్ట్రీ బదులు ‘ఓరల్‌, మ్యాక్సిల్లో ఫేషియల్‌ సర్జరీ’ అని పేర్కొన్నారు.

తాను అనుకున్న వ్యక్తికి ఆ పదవి దక్కేలా తిరుపతిలోని వైసీపీ ముఖ్యనేత ఒకరు చెప్పడంతో తాజా నోటిఫికేషన్‌లో డెంటిస్ట్రీ బదులు.. ఎండీఎ్‌సలో ఒక స్పెషాలిటీ పేరు పేట్టారని అంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 14 నెలలైనా స్విమ్స్‌లో మాత్రం ఆయన ప్రభావం కనిపిస్తుండటం ఈ నోటిఫికేషనే నిదర్శనం.

టీటీడీ నిర్వహణలోని స్విమ్స్‌లో 9 ప్రొఫెసర్‌, 20 అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 67 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల నియామకానికి గత నెల 14న నోటిఫికేషన్‌ జారీ అయింది. ఇందులో డెంటల్‌ విభాగంలోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టు ఉంది. ఆ విభాగాన్ని డెంటిస్ట్రీ అని పేర్కొనాలి. దీనికి ఎండీఎస్‌ (మాస్టర్‌ ఆఫ్‌ డెంటల్‌ సర్జరీ)లో ఎనిమిది స్పెషాలిటీల వైద్యులందరూ దరఖాస్తు చేయడానికి అర్హులవుతారు. ఆ ప్రకారమే 2023లో నోటిఫికేషన్‌ ఇచ్చారు. మరిప్పుడు ప్రత్యేకించి ‘ఓరల్‌ మ్యాక్సిలో ఫేషియల్‌ సర్జరీ’ అన్న స్పెషాలిటీని మాత్రమే నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇలా చేయడం వెనుక తిరుపతికి చెందిన వైసీపీ ముఖ్య నేత ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ నేత సిఫార్సు చేసిన వ్యక్తికి ఈ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టు దక్కేందుకే ఇలా చేశారని అంటున్నారు. 2023 అక్టోబరు 22న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో డెంటిస్ట్రీ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టును చేర్చారు. ఆ పోస్టుకు వైసీపీ నేత తనకు కావాల్సిన అభ్యర్థిని సిఫారసు చేసినట్టు సమాచారం. అప్పట్లో వైసీపీనే అధికారంలో ఉండటంతో ఆ నేత సూచించిన అభ్యర్థికే ఆ పోస్టు దక్కుతుందని ధీమాతో ఉన్నారట. అందుకని రూ.25 లక్షలకు బేరం కుదుర్చుకుని ఆ నేత వ్యక్తిగత సహాయకుడి ద్వారా రూ.23 లక్షలు తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. అప్పట్లో ఈ పోస్టుకోసం రాష్ట్ర అత్యున్నత నేత.. సీఎంవోలో చక్రం తిప్పిన అధికారి తమ వాళ్లకూ సిఫారసు చేయడంతో టీటీడీ కీలక అధికారి తీవ్ర ఒత్తిడికిలోనై ఆ పోస్టును భర్తీ చేయలేదని సమాచారం. ఆ డబ్బు వెనక్కి ఇవ్వాలని ఆ వ్యక్తి వైసీపీ నేతను ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. డబ్బు ఇవ్వని ఆయన.. వైసీపీ ప్రభుత్వంలో నియమితులై ఇప్పటికీ కొనసాగుతున్న స్విమ్స్‌ కీలక అధికారులపై ఒత్తిడి తెచ్చి తాజా నోటిఫికేషన్‌లో ఆ పోస్టును మళ్లీ చేర్చినట్టు ప్రచారం జరుగుతోంది. తాను సూచించిన అభ్యర్థికే పోస్టు దక్కేలా .. ఆ వ్యక్తి చేసిన స్పెషాలిటీని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారనే ప్రచారం నడుస్తోంది. ఇలాగైతే తక్కువ మంది దరఖాస్తు చేస్తారని తద్వారా తమ అభ్యర్థికి అవకాశం ఇప్పించుకోవచ్చని ఆ నేత భావించారట. ఈ విభాగంలోని రెగ్యులర్‌ ప్రొఫెసర్‌ది ‘ఓరల్‌, మ్యాక్సిల్లో ఫేషియల్‌ సర్జరీ’ స్పెషలైజనే. ఇప్పుడు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కూ ఇదే స్పెషాలిటీ పేర్కొనడం ద్వారా స్విమ్స్‌ అధికారులు తీవ్ర విమర్శలను, ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఆ అసిస్టెంటు ప్రొఫెసర్‌ పోస్టును డెంటిస్ట్రీ డిపార్టుమెంటు కింద చూపకుంటే తామంతా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోతామని స్విమ్స్‌లోనే డెంటల్‌ విభాగంలో అడహాక్‌ పోస్టుల్లో కొనసాగుతున్న కొందరు బతిమలాడినట్టు సమాచారం. వారికి ఆ వైసీపీ నేత వ్యక్తిగత సహాయకుడు.. స్విమ్స్‌లో కొందరు అధికారుల నుంచీ బెదిరింపులు ఎదురైనట్టు తెలిసింది. దీనిపై వివరాలు సేకరించిన టీటీడీ పాలకమండలి సభ్యులొకరు టీటీడీ ఈవోకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడుతున్నట్టు సమాచారం. కాగా, గత ప్రభుత్వంలో పెద్దల సిఫారసుతో బయటి నుంచి నియమితులైన కీలక అధికారులు ఇంకా కొనసాగుతుండటంతో వైసీపీ హవా నడుస్తున్నట్లు సమాచారం.

Updated Date - Sep 04 , 2025 | 02:21 AM