Share News

యోగనరసింహుడిగా.. భక్తులను కటాక్షించిన పద్మావతి

ABN , Publish Date - Nov 20 , 2025 | 01:30 AM

తిరుచానూరులోని పద్మావతీదేవి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన బుధవారం ఉదయం ముత్యపుపందిరిపై అమ్మవారు శ్రీధనలక్ష్మి రూపంలో భక్తులను కటాక్షించారు. మేళతాళాలు, వేద, ప్రబంధ పారాయణం, భజన బృందాల ప్రదర్శనలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ తిరువీధుల్లో ముత్యపుపందిరి వాహనం ముందుకు సాగింది. మధ్యాహ్నం శ్రీకృష్ణ ముఖమండపంలో ఉత్సవమూర్తికి నేత్రానందంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఆస్థాన మండపంలో ఊంజల్‌సేవ నిర్వహించారు. రాత్రి సింహవాహనంపై యోగనరసింహుడి రూపంలో అమ్మవారు తిరుమాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. కళాబృందాల సాంస్కృతిక నీరాజనంతో అమ్మవారి సింహవాహన సేవ అత్యంత రమణీయంగా సాగింది. ఆయా కార్యక్రమాల్లో జీయర్‌ స్వాములు, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, బోర్డు సభ్యుడు భానుప్రకా్‌షరెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో హరీందర్‌నాథ్‌, ఏఈవో దేవరాజులు, ఏవీఎస్వో రాధాకృష్ణమూర్తి, అర్చకులు శ్రీనివాసాచార్యులు బాబుస్వామి, మణికంఠస్వామి, సూపరింటెండెంట్లు రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌, చలపతి, సుబ్బరాయుడు సుభాస్కర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.

 యోగనరసింహుడిగా..   భక్తులను కటాక్షించిన పద్మావతి
యోగనరసింహుడిగా.. భక్తులను కటాక్షించిన పద్మావతి

తిరుచానూరు, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): తిరుచానూరులోని పద్మావతీదేవి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన బుధవారం ఉదయం ముత్యపుపందిరిపై అమ్మవారు శ్రీధనలక్ష్మి రూపంలో భక్తులను కటాక్షించారు. మేళతాళాలు, వేద, ప్రబంధ పారాయణం, భజన బృందాల ప్రదర్శనలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ తిరువీధుల్లో ముత్యపుపందిరి వాహనం ముందుకు సాగింది. మధ్యాహ్నం శ్రీకృష్ణ ముఖమండపంలో ఉత్సవమూర్తికి నేత్రానందంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఆస్థాన మండపంలో ఊంజల్‌సేవ నిర్వహించారు. రాత్రి సింహవాహనంపై యోగనరసింహుడి రూపంలో అమ్మవారు తిరుమాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. కళాబృందాల సాంస్కృతిక నీరాజనంతో అమ్మవారి సింహవాహన సేవ అత్యంత రమణీయంగా సాగింది. ఆయా కార్యక్రమాల్లో జీయర్‌ స్వాములు, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, బోర్డు సభ్యుడు భానుప్రకా్‌షరెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో హరీందర్‌నాథ్‌, ఏఈవో దేవరాజులు, ఏవీఎస్వో రాధాకృష్ణమూర్తి, అర్చకులు శ్రీనివాసాచార్యులు బాబుస్వామి, మణికంఠస్వామి, సూపరింటెండెంట్లు రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌, చలపతి, సుబ్బరాయుడు సుభాస్కర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఫ బ్రహ్మోత్సవాల్లో నేడు

ఉదయం కల్పవృక్ష వాహనం

మధ్యాహ్నం 12.30 గంటలకు స్నపన తిరుమంజనం

సాయంత్రం 6 గంటలకు ఊంజల్‌సేవ

రాత్రి హనుమంత వాహనం

Updated Date - Nov 20 , 2025 | 01:32 AM