పద్మావతి వర్సిటీకి ఐఎ్‌సవో గుర్తింపు
ABN , Publish Date - Apr 18 , 2025 | 12:40 AM
శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీకి ఐఎ్‌సవో గుర్తింపు లభించింది. రెండు రోజులుగా యూనివర్సిటీలో బోధన, పరిశోధన, విస్తరణ, పాలన తదితర అంశాలను ఐఎ్‌సవో బృందం పరిశీలించింది. ఈ అంశాల్లో పద్మావతి మహిళా యూనివర్సిటీ అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటిస్తోందంటూ కితాబిచ్చింది. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను వీసీ ఉమకు హిమ్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండీ ఆలపాటి శివయ్య అందజేశారు. దీంతో పాటు గ్రీన్ జోన్ ఎమ్సెరిగేట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డును ప్రదానం చేశారు. రిజిస్ట్రార్ ఎన్.రజని, ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ డైరెక్టర్ టి.త్రిపురసుందరి, టి.సీతాకుమారి (లా), ప్రొఫెసర్ జాన్ సుష్మా (బయో టెక్నాలజీ), పి.విజయలక్ష్మి, బీఎన్ నీలిమ (జర్నలిజం), డాక్టర్ నీరజ (ఉమెన్ స్టడీస్), పీఆర్వో డాక్టర్ శ్రీరజని తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీకి ఐఎ్‌సవో గుర్తింపు లభించింది. రెండు రోజులుగా యూనివర్సిటీలో బోధన, పరిశోధన, విస్తరణ, పాలన తదితర అంశాలను ఐఎ్‌సవో బృందం పరిశీలించింది. ఈ అంశాల్లో పద్మావతి మహిళా యూనివర్సిటీ అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటిస్తోందంటూ కితాబిచ్చింది. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను వీసీ ఉమకు హిమ్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండీ ఆలపాటి శివయ్య అందజేశారు. దీంతో పాటు గ్రీన్ జోన్ ఎమ్సెరిగేట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డును ప్రదానం చేశారు. రిజిస్ట్రార్ ఎన్.రజని, ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ డైరెక్టర్ టి.త్రిపురసుందరి, టి.సీతాకుమారి (లా), ప్రొఫెసర్ జాన్ సుష్మా (బయో టెక్నాలజీ), పి.విజయలక్ష్మి, బీఎన్ నీలిమ (జర్నలిజం), డాక్టర్ నీరజ (ఉమెన్ స్టడీస్), పీఆర్వో డాక్టర్ శ్రీరజని తదితరులు పాల్గొన్నారు.